హోమియో వైద్యంపై విచారణ

ABN , First Publish Date - 2020-08-07T06:21:41+05:30 IST

ఐసీఎంఆర్‌ నిబంధనలను అతిక్రమిస్తూ హోమియో వైద్యం చేసిన ఘటనపై ఆయుష్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అల్గువర్షిణి ఆదేశంతో విచారణ కమిటీ గురువారం

హోమియో వైద్యంపై విచారణ

హన్మకొండ అర్బన్‌,  ఆగస్టు 6: ఐసీఎంఆర్‌ నిబంధనలను అతిక్రమిస్తూ హోమియో వైద్యం చేసిన ఘటనపై ఆయుష్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అల్గువర్షిణి ఆదేశంతో విచారణ కమిటీ గురువారం నగరానికి చేరింది. హన్మకొండలోని ఆయుష్‌ ఆర్‌డీడీ కార్యాలయంలో ఆయుష్‌ విభాగం అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లింగరాజు, సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ పార్థసారథి, డాక్టర్‌ లక్ష్మీనారాయణ బృందం గురువారం విచారణ చేపట్టింది. అనంతరం డాక్టర్‌ లింగరాజు విలేకరులతో మాట్లాడుతూ.. హోమియోలో కరోనాకు మందులేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం రోగనిరోదకశక్తిని పెంచే ఔషధాలు మాత్రమే హోమియోలో ఉన్నాయన్నారు. ఐసీఎంఆర్‌ నిబంధనలను అతిక్రమిస్తూ చేసిన హోమియో  వైద్యంపై విచారణ జరిపామని నివేదికను ఆయుష్‌ డైరెక్టర్‌కు సమర్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-07T06:21:41+05:30 IST