పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ

ABN , First Publish Date - 2022-08-18T04:55:45+05:30 IST

కారంచేడు పంచాయతీలో నిధులు దుర్వినియోగం ఆరోపణలపై బుధవారం బాపట్ల జిల్లా డీపీవో ఎ.రమేష్‌, డీఎల్‌పీవో వి.వెంకట్రావ్‌ అధ్వర్యంలో విచారణ చేపట్టారు. 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించి గ్రామ జనరల్‌ ఫండ్‌ నిధులతోపాటు, గ్రామ చెరువు మాన్యం 32 ఎకరాల కౌలు వేలం మొత్తం రూ.75లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు గ్రామ సర్పంచ్‌ బాలిగ శివపార్వతి డీపీవో ఒంగోలు, జిల్లా పరిషత్‌ సీఈవోలకు ఫిర్యాదు చేశారు. నిధులకు సంబంధించి ఉద్యోగుల ఖాతాలో జమచేసుకున్నట్లు సర్పంచ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ
రికార్డులను పరిశీలిస్తున్న డీపీవో రమేష్‌

కారంచేడు(పర్చూరు), అగస్టు 17: కారంచేడు పంచాయతీలో నిధులు దుర్వినియోగం ఆరోపణలపై బుధవారం బాపట్ల జిల్లా డీపీవో ఎ.రమేష్‌, డీఎల్‌పీవో వి.వెంకట్రావ్‌ అధ్వర్యంలో విచారణ చేపట్టారు.  2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించి గ్రామ జనరల్‌ ఫండ్‌ నిధులతోపాటు, గ్రామ చెరువు మాన్యం 32 ఎకరాల కౌలు వేలం మొత్తం రూ.75లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు గ్రామ సర్పంచ్‌ బాలిగ శివపార్వతి డీపీవో ఒంగోలు, జిల్లా పరిషత్‌ సీఈవోలకు ఫిర్యాదు చేశారు. నిధులకు సంబంధించి ఉద్యోగుల ఖాతాలో జమచేసుకున్నట్లు సర్పంచ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై జిల్లా పరిషత్‌ సీఈవో, డివిజనల్‌ డెవలె్‌పమెంట్‌ అధికారి(డీఎల్‌డీవో) ఒంగోలు డివిజన్‌ రాజేందర్‌ను విచారణ అధికారిగా నియమించి  2021 ఆగస్టు 7న మండల పరిషత్‌ కార్యాలయంలో విచారణ చేపట్టారు. విచారణ చేపట్టి ఏడాది గడుస్తున్నా నేటికీ తేల్చలేదన్నారు. ఈనేపథ్యంలో సోమవారం బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. కారంచేడు కార్యాలయానికి చేరుకున్న అధికారులు రికార్డులు పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారుల వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ సేకరించటంతోపాటు, లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నివేదిక తయారుచేసి కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. నిధులు దుర్వినియోగం అయినట్లు నిరూపణ అయితే బాధితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-08-18T04:55:45+05:30 IST