కోర్టు ఏర్పాటుకు భవనాల పరిశీలన

ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST

కోర్టు ఏర్పాటుకు భవనాల పరిశీలన

కోర్టు ఏర్పాటుకు భవనాల పరిశీలన
కోర్టుహాల్‌కు ఎంపిక చేసిన భవనాన్ని పరిశీలిస్తున్న ఎన్‌బీసీ సభ్యుడు తల్లోజు ఆచారి


ఆమనగల్లు, మే 21: ఆమనగల్లు పట్టణంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి, మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఏర్పాటుకు ఎంపిక చేసిన మండల పరిషత్‌ ఆవరణలోని పాత కార్యాలయం, సమావేశ మందిరం, రెండు క్వార్టర్స్‌ను శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌, జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారిలు వేర్వేరుగా పరిశీలించారు. కోర్టుల ఏర్పాటుకు అనుగుణంగా ఆ భవనాలలో త్వరగా సౌకర్యాలు కల్పించాలని వారు అధికారులు, మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. కల్వకుర్తి కోర్టు పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల మండలాల ప్రజలకు సత్వర న్యాయసేవల కోసం కోర్టు ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమని జైపాల్‌యాదవ్‌, ఆచారిలు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2వ తేదీన కోర్టును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోర్టు భవనాల మరమ్మతులు, ఆధునికీకరణకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10లక్షలు అందిస్తామని జైపాల్‌యాదవ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, వైస్‌చైర్మన్‌ తోట గిరియాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, తహసీల్దార్‌ పాండునాయక్‌, ఎంపీడీవో వెంకట్రాములు, కండె హరిప్రసాద్‌, చిందం కృష్ణయ్య, ఆంజనేయులు, చెక్కాల లక్ష్మణ్‌, చెన్నకేశవులు, శ్రీకాంత్‌సింగ్‌, విజయ్‌కృష్ణ, గోరటి నర్సింహ, శ్రీధర్‌, సయ్యద్‌ ఖలీల్‌, బాలస్వామి, నిరంజన్‌, రఘు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-21T05:30:00+05:30 IST