ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీ

ABN , First Publish Date - 2021-05-11T05:03:03+05:30 IST

నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎలక్ట్రికల్‌, ఫైర్‌ సేఫ్టీ పరికరాలను సోమవారం జిల్లా ఫైర్‌ అధికారి హనుమంతరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలపై సిబ్బందికి అవగాహన ఉండాలని సూచించారు.

ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీ
ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేస్తున్న జిల్లా ఫైర్‌ అధికారి

కడప(క్రైం), మే 10: నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎలక్ట్రికల్‌, ఫైర్‌ సేఫ్టీ పరికరాలను సోమవారం జిల్లా ఫైర్‌ అధికారి హనుమంతరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలపై సిబ్బందికి అవగాహన ఉండాలని సూచించారు. నాణ్యమైన పరికరాలు వినియోగించడంతో పాటు ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి, అగ్నిమాపక పరికరాలతో పాటు గ్రౌండ్‌ వాటర్‌ లెవల్‌ కూడా అప్పుడప్పుడూ పరిశీలించాలన్నారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో కడప ఫైర్‌ అధికారి లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T05:03:03+05:30 IST