రైల్వే లైన డబ్లింగ్‌ పనుల తనిఖీ

Published: Thu, 18 Aug 2022 23:47:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రైల్వే లైన డబ్లింగ్‌ పనుల తనిఖీ తాటిచెర్ల స్టేషనలో కంట్రోల్‌ బోర్డు ప్యానెల్‌నుపరిశీలిస్తున్న సీసీఆర్‌ఎస్‌ అధికారి


గుంతకల్లు/అనంతపురం న్యూటౌన ఆగస్టు 18: గుత్తి-ధర్మవరం రైల్వే సెక్షనలో జరుగుతున్న డబ్లింగ్‌, విద్యుద్దీకరణ పనులను చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీసీఆర్‌ఎస్‌)  అధికారి శైలేశ కుమార్‌ పాథక్‌ గురువారం తనిఖీలు నిర్వహించారు. తాటిచెర్ల-జంగాలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న రైల్వే లైన డబ్లింగ్‌, ఎలెకి్ట్రఫికేషన పనులు పూర్తికావడంతో సీసీఆర్‌ఎస్‌ అధికారి తనిఖీలు చేపట్డారు. ఆయన పరిశీలనలో సంతృప్తిపడితే ఈ మార్గంలో రైళ్లను నడపడానికి అనుమతులు లభిస్తాయి. ఈ మేరకు ఉదయం 7 గంటలకు గుంతకల్లుకు వచ్చిన సీసీఆర్‌ఎస్‌, ఆయన సహాయకుల వెంట స్థానిక డీఆర్‌ఎం వెంకట రమణారెడ్డి, సబార్డినేట్‌ అధికారులు లైనపై వెళ్లారు. ఈ లైనలో విద్యుద్దీకరణ పనితీరు, రైల్వే ట్రాక్‌ పటిష్టత, నిర్మాణ పనుల్లో నాణ్యత, ఇతర లోటుపాట్లను అంచనావేసి ఈ మార్గంలో వేగంగా రైలును నడిపి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ సెక్షనలో రైళ్లను నడపడానికి అనుమతులు లభిస్తే గుంతకల్లు-జంగాలపల్లి వరకూ డబుల్‌ లైన నిరాటంకం అవుతుంది. ఈ మార్గంలో రైళ్లు వేగంగా నడవడానికి, క్రాసింగ్‌ల వల్ల జాగు ఏర్పడకుండా ఉండటానికి వీలౌతుంది. రాత్రి వరకూ జరిగిన సీసీఆర్‌ఎస్‌ తనిఖీల్లో ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఇంజనీరు, చీఫ్‌ బ్రిడ్జి ఇంజనీరు, చీఫ్‌ ఫీల్డ్‌ ఇంజనీరు, తదితరులు పాల్గొన్నారు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.