పది‘ పరీక్ష కేంద్రాల తనిఖీ

ABN , First Publish Date - 2022-05-26T07:18:06+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వేదం హైస్కూల్‌, భైంసా మండలం తిమ్మాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కొనసాగుతున్న పది పరీక్ష కేంద్రాలను బుధవారం రాష్ట్ర పరిశీలకురాలు, రాష్ట్ర మోడల్‌ స్కూల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సరోజిని దేవీ పరిశీలించారు.

పది‘ పరీక్ష కేంద్రాల తనిఖీ
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తున్న మోడల్‌స్కూల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సరోజినిదేవి

భైంసా, మే 25 ; పట్టణంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, వేదం హైస్కూల్‌, భైంసా మండలం తిమ్మాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కొనసాగుతున్న పది పరీక్ష కేంద్రాలను బుధవారం రాష్ట్ర పరిశీలకురాలు, రాష్ట్ర మోడల్‌ స్కూల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సరోజిని దేవీ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన వసతులపై ఆరా తీశారు. మాస్‌ కాపియింగ్‌ జరుగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. ఆమె వెంట ఏసీజీఈ పద్మ, ఎంఈవో సుభాష్‌, తిమ్మాపూర్‌ సీఎస్‌ రమణరావు ఉన్నారు.

భైంసా రూరల్‌, మే 25 : మండలంలో బుధవారం 10వ తరగతి పరీక్షాకేంద్రాలను జాయింట్‌ డైరెక్టర్‌ సరోజినిదేవి పరిశీలించారు. తిమ్మాపూర్‌ పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ఏసీజీఈ పద్మ తదితరులున్నారు.

Updated Date - 2022-05-26T07:18:06+05:30 IST