యువతకు స్ఫూర్తి అల్లూరి

Published: Mon, 04 Jul 2022 23:54:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
యువతకు స్ఫూర్తి అల్లూరి

అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎస్పీ మలిక గర్గ్‌

ఒంగోలు(క్రైం), జూలై 4: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు యువతకు స్ఫూర్తిదాయకమని ఎస్పీ మలికగర్గ్‌ పేర్కొన్నారు. బ్రిటీష్‌ వారి గుండెల్లో సిం హస్వప్నంలా  నిలిచిన వి ప్లవ జ్యోతి అల్లూరి అని అ న్నారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి సందర్భంగా సోమవారం ఎస్పీ కార్వాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  మన్యం వీరుడు స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.నాగేశ్వరరావు, శ్రీధరరావు, ఆశోక్‌బాబు, ఎస్బీ డీఎస్పీ బి.మరియదాసు, ఒంగోలు ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జునరావు, డీసీఆర్‌బీ సీఐ మొయిన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆల్లూరి జయంతి

ఒంగోలు(కలెక్టరేట్‌),. జూలై 4: అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో  సోమవారం స్థానిక గుంటూరు రోడ్డులో ఆయ న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సేవాసమితి అధ్య క్షుడు వాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆజాది కా అమృత్‌ మ హోత్సవ్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 30 అడుగుల అ ల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. త్వర లో జిల్లాలో విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రావూరి బుజ్జి, షేక్‌ బాచి, సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి, షణ్ముఖరాజు, చం దు, జూల్లపల్లి సురేష్‌, విజయకుమార్‌రాజు, యశ్వంత్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో..

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో  మన్యం వీరుడు ఆల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వవహించారు. కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న మంచిపుస్తకం కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో ఓపీడీఆర్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్‌ మాట్లాడుతూ బ్రిటీష్‌ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం అడవి బిడ్డలను చైతన్యవం తులను చేసి సీతారామరాజు ఉద్యమించారన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బి.సుబ్బారావు, చుండూరి రంగారావు, కరువది సు బ్బారావు, షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌, పిన్నిక శ్రీను, ఆవుల సుబ్రహ్మణ్యం, లింగా వెంకటేశ్వర్లు, జె.జగన్‌బాబు, రాంమోహన్‌ రెడ్డి, మన్నం రమేష్‌, పాలడుగు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు (కల్చరల్‌): జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అల్లూరి సీతారామ రాజు చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా సంస్థ కార్యదర్శి బొమ్మల కోటేశ్వరి మాట్లాడుతూ పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది ఎం.శ్రీనివా సులు, సందీప్‌, పి.ఇమ్మానియేల్‌, శివకుమారి పాల్గొన్నారు.

విప్లవ వీరుడు..

అనంతవరం(టంగుటూరు),జూలై 4 :భారతదేశం స్వాతంత్య్ర సంగ్రామంలో వెన్ను చూపని విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజని ఎంపీడీవో పి. అజిత అల్లూరి దేశ భక్తిని కొనియాడారు. మండలంలోని అనంతవరంలో సోమవారం  అల్లూరి శీతారామరాజు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పంచాయతీ సర్పంచ్‌ ఉప్పలపాటి శివరామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో మాట్లాడుతూ తెల్ల దొరలను ఎదిరించిన తెలుగుబిడ సీతారామరాజన్నారు. వైసీపీ కొండపి ఇన్చార్జ్‌ వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ నాటి బ్రిటిష్‌ పాలకులను ఎదిరించి గిరిజనులను సమైక్యపరచి బ్రిటిష్‌ ప్రభుత్వంపై సాయుధపోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి అని అన్నారు.  సర్పంచ్‌ ఉప్పలపాటి శివరామరాజు మాట్లాడుతూ తెలుగుగడ్డపై గర్జించిన విప్లవ జ్యోతి, తెలుగుజాతి ప్రజల ముద్ద్దుబిడ్డ అల్లూరి అన్నారు. ముందుగా అతిథులంతా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జయంతి సందర్భంగా కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఎంపీపీ పటాపంజుల కోటేశ్వరమ్మ, వైసీపీ మండల అధ్యక్షుడు ఎస్‌. శ్రీహరిరావు, సొసైటీ అధ్యక్షుడు రావూరి ప్రవీణ్‌కుమార్‌, ఎంబీసీ డైరెక్టర్‌ పుట్టా వెంకట్రావు, ఏఎంసీ వైఎస్‌ చైర్మన్‌ చింతపల్లి హరిబాబు, ఎస్‌. నారాయణరావు, స్థానిక వైసీపీ నాయకులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు 

మర్రిపూడి: స్వాతంత్య్ర సమరంలో అల్లూరి సీతారామరాజు ప్రదర్శించిన తెగువ యువతకు ఆదర్శ ప్రాయమని ఎంపీపీ ఎంపీపీ వాకా వెంకటరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయలక్ష్మీ, ఎంపీడీవో కరిముల్లా, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.