టీనేజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌ సేఫ్టీ ఫీచర్లు

ABN , First Publish Date - 2021-03-20T05:37:58+05:30 IST

ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని ‘ఇన్‌స్టాగ్రామ్‌’ టీనేజర్లను దృష్టిలో పెట్టుకుని నాలుగు సేఫ్టీ ఫీచర్లను విడుదల చేసే సన్నాహాల్లో ఉంది. మెసేజ్‌ల రూపంలో పెద్దలు అనుచితంగా ప్రవర్తించి పిన్నలను ఇబ్బందిపెట్టకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటోంది

టీనేజర్లకు ఇన్‌స్టాగ్రామ్‌ సేఫ్టీ ఫీచర్లు

ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని ‘ఇన్‌స్టాగ్రామ్‌’  టీనేజర్లను దృష్టిలో పెట్టుకుని నాలుగు సేఫ్టీ ఫీచర్లను విడుదల చేసే సన్నాహాల్లో ఉంది. మెసేజ్‌ల రూపంలో పెద్దలు అనుచితంగా ప్రవర్తించి  పిన్నలను ఇబ్బందిపెట్టకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటోంది. తద్వారా పిల్లలకు రక్షణ కల్పించే చర్యలకు  పూనుకుంటోంది. సంబంధిత వివరాలను బ్లాగ్‌స్పాట్‌లో ‘ఇన్‌స్టాగ్రామ్‌’ తెలియజేసింది


‘సజెస్టడ్‌ యూజర్స్‌’లో టీనేజర్ల అకౌంట్లు పెద్దలకు తెలియకుండా కట్టడి చేయనుంది. ముఖ్యంగా టీన్స్‌ వెలిబుచ్చే అభిప్రాయాలు, కామెంట్లు పెద్దలకు కనిపించకుండా దాచిపెడుతుంది. ఈ ప్రక్రియ అంతా ఆటోమేటిక్‌గా జరిగేలా చూస్తుంది.


పిన్నలు పెద్దల మధ్య గీత

‘ఇన్‌స్టాగ్రామ్‌’లో తమను అనుసరించని 18 ఏళ్ళ వయస్సు లోపు పిల్లలకు, పెద్దలు మెసేజ్‌ పంపలేరు. డైరెక్ట్‌ మెసేజ్‌(డీఎం) పంపే ఆప్షన్‌ లేదన్న నోటిఫికేషన్‌ వారికి కనిపిస్తుంది. మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ సహాయంతో ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ‘ఇన్‌స్టాగ్రామ్‌’కు సైనప్‌ చేసినప్పుడే వయసు తెలుసుకుంటుంది. తద్వారా పెద్దల నుంచి టీనేజర్లకు నేరుగా మెసేజ్‌లు వెళ్ళకుండా అడ్డుకోగలుగుతుంది. 


పారా హుషార్‌!

తరచూ మెసేజ్‌ల ద్వారా మేజర్‌ వ్యక్తుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నప్పుడు టీనేజర్లను ఇన్‌స్టాగ్రామ్‌ హెచ్చరిక చేస్తుంది.  సేఫ్టీ నోటీసుతో ఈ పని చేస్తుంది. చర్చకు ముగింపు పలకడం, బ్లాక్‌ లేదంటే రిపోర్టు చేయడం లేదా సదరు పెద్దమనిషిని అదుపులో ఉంచడం ఈ ఫీచర్‌తో వీలుపడుతుంది. 


అనుచిత బిహేవియర్‌కు అడ్డుకట్ట

టీన్స్‌తో ఇంటరాక్ట్‌ అయ్యే సందర్భాల్లో పెద్దలు అనుచితంగా ప్రవర్తించడాన్ని అడ్డుకట్ట వేసే పని రాబోయే వారాల్లో అమలులోకి తేనున్నట్టు ‘ఇన్‌స్టాగ్రామ్‌’ తెలిపింది. ఇందుకోసం ‘సజెస్టడ్‌ యూజర్స్‌’లో టీనేజర్ల అకౌంట్లు పెద్దలకు తెలియకుండా కట్టడి చేయనుంది. ముఖ్యంగా టీన్స్‌ వెలిబుచ్చే అభిప్రాయాలు, కామెంట్లు పెద్దలకు కనిపించకుండా దాచిపెడుతుంది. ఈ ప్రక్రియ అంతా ఆటోమేటిక్‌గా జరిగేలా చూస్తుంది. 


పిన్నల అకౌంట్‌ ప్రైవేటు

పద్దెనిమిది సంవత్సరాలకు లోపు పిల్లల అకౌంట్లు పబ్లిక్‌గా ఆరంభమవుతాయి. అయితే, నోటిఫికేషన్లతో వారిని అప్రమత్తం చేసి, అకౌంట్లను ప్రైవేటుకు మారేలా ప్రోత్సహిస్తుంది. అలాగే సెట్టింగ్స్‌తో ఒకసారి చెక్‌ చేసుకోవాలని కూడా ‘ఇన్‌స్టాగ్రామ్‌’ సూచిస్తుంది.

Updated Date - 2021-03-20T05:37:58+05:30 IST