Instagram:వారంలో రెండోసారి అంతరాయం..సమస్య పరిష్కరించిన టెక్నికల్ టీం

ABN , First Publish Date - 2021-10-09T13:54:33+05:30 IST

ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో శుక్రవారం మరోసారి అంతరాయం ఏర్పడింది....

Instagram:వారంలో రెండోసారి అంతరాయం..సమస్య పరిష్కరించిన టెక్నికల్ టీం

న్యూఢిల్లీ : ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో శుక్రవారం మరోసారి అంతరాయం ఏర్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌ లో అంతరాయం వాటిల్లిందని 10,400 మంది వినియోగదారులు యాప్‌కు సంబంధించిన సమస్యలను నివేదించారు.ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ లో సోమవారం భారీ అంతరాయాన్ని ఎదుర్కొన్న తర్వాత వారం రోజుల్లోపు మరోసారి నిలిపివేశారు.దీంతో నెటిజన్లకు ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి తాము కృషి చేస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్‌ టీం వెల్లడించింది. తాము ఇన్‌స్టాగ్రామ్ లో అంతరాయం సమస్యను పరిష్కరించామని కమ్యూనికేషన్ టీమ్ వివరించింది. నెటిజన్లకు కలిగిన అంతరాయానికి ఇన్‌స్టాగ్రామ్ క్షమాపణలు తెలిపింది. 


Updated Date - 2021-10-09T13:54:33+05:30 IST