ఇన్‌స్టాగ్రామ్‌ సైలెంట్‌ మెసేజెస్‌

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత మెరుగుపర్చేందుకు అనేకానేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. అవతల ఎవరు ఉన్నారో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకుని సైలెంట్‌గా

ఇన్‌స్టాగ్రామ్‌ సైలెంట్‌ మెసేజెస్‌

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత మెరుగుపర్చేందుకు అనేకానేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. అవతల ఎవరు ఉన్నారో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకుని సైలెంట్‌గా మెసేజ్‌లు పెట్టేందుకు వీలు సహా పలు ఫీచర్లు ఉన్నాయి. అవేంటంటే...


  • ఒకవైపు ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్స్‌పీరియెన్స్‌కు ఎలాంటి ఆటంకం కలుగకుండానే ఆసక్తికరమైన సమాచారాన్ని షేర్‌ చేయవచ్చు. షేర్‌ బటన్‌ టాప్‌ చేసి పట్టుకుని మరీ పెద్దగా ఇబ్బంది లేకుండానే సన్నిహిత స్నేహితులకు పోస్టులను రీషేర్‌ చేసుకోవచ్చు.
  • లో-ఫై చాట్‌ థీమ్‌తో సంభాషణలను మరింత పర్సనల్‌గా కొనసాగించవచ్చు.
  • డిన్నర్‌కు ఎక్కడికి వెళ్ళాలి, ఏ సమయానికి ఎక్కడ కలుసుకుందాం వంటివి డిసైడ్‌ చేసుకోవచ్చు. గ్రూప్‌ చాట్‌లోనే నేరుగా పోల్‌కు వెళ్ళవచ్చు. 
  • ప్లే, పాజ్‌, రీప్లే వంటవి సౌలభ్యాలు ఉన్నాయి. యాపిల్‌ మ్యూజిక్‌, అమెజాన్‌ మ్యూజిక్‌తో ఇంటిగ్రేషన్‌ ఫలితంగా 30 సెకెండ్లు అంటే అర నిమిషం నిడివి గల ప్రివ్యూను షేర్‌ చేసుకోవచ్చు. మీ స్నేహితులు సైతం నేరుగా చాట్‌ నుంచే ఆ మ్యూజిక్‌ను వినవచ్చు.
  • ఆన్‌లైన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరు ఉన్నారు అన్నది తెలుసుకోవచ్చు. ఇన్‌బాక్స్‌ టాప్‌లో చాట్‌ చేసే సమయానికి ఎవరు చాట్‌ చేసేందుకు ఖాళీగా ఉన్నారో తెలుసుకోవచ్చు. తద్వారా స్నేహితులతో కలిసి చాట్‌ చేయవచ్చు. 
  • సైలెంట్‌గా మెసేజ్‌లను పంపుకోవచ్చు. అర్ధరాత్రి లేదంటే ‘అట్‌ సైటెంట్‌’ అని వారు యాడ్‌ చేసుకుంటున్న సమయంలో ఈ పని చేసేయవచ్చు. అవి పంపడం ఉచితమా కాదా అన్న ఆందోళన చెందాల్సిన పని కూడా ఉండదు.
  • బ్రౌజ్‌ చేస్తూనే సమాధానం ఇవ్వవచ్చు. ఒకవైపు వస్తున్న ఫీడ్‌ చూసుకుంటూనే, మరోవైపు ఇన్‌బాక్స్‌లోకి వెళ్ళడం లేదా సమయాన్ని కోల్పోవడం వంటివేవీ లేకుండా సమాధానం ఇచ్చుకోవచ్చు. సంబంధిత కొత్త ఫీచర్‌, చాట్‌ చేసేందుకు చాలా అనుకూలమైనది.

Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST