వీడియో కాల్‌లో నగ్నంగా మాట్లాడిన యువతి.. ఆ తరువాత ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-01-04T10:23:19+05:30 IST

ఒక ఇన్స్‌రూన్స్ ఏజెంట్‌కి పాలసి కావాలంటూ ఒక యువతి ఫోన్ చేసింది. ఆ తరువాత అతని వాట్సాప్ నెంబర్ తీసుకొని వీడియో కాల్ చేసి.. మాట్లాడుతూ క్రమంగా తన బట్టలు విప్పేసింది. అదే సమయంలో స్క్రీన్ షాట్ తీసి అతనికి రూ.50 వేలు డబ్బులివ్వమంటూ బ్లాక్ మెయిల్ చేసింది...

వీడియో కాల్‌లో నగ్నంగా మాట్లాడిన యువతి.. ఆ తరువాత ఏం చేసిందంటే..

ఒక ఇన్స్‌రూన్స్ ఏజెంట్‌కి పాలసి కావాలంటూ ఒక యువతి ఫోన్ చేసింది. ఆ తరువాత అతని వాట్సాప్ నెంబర్ తీసుకొని వీడియో కాల్ చేసి.. మాట్లాడుతూ క్రమంగా తన బట్టలు విప్పేసింది. అదే సమయంలో స్క్రీన్ షాట్ తీసి అతనికి రూ.50 వేలు డబ్బులివ్వమంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఈ ఘటన బీహార్ రాజధాని పట్నాలో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. పట్నాలో నివసించే నారాయణ్ సాహు ఒక  ఇన్స్‌రూన్స్ ఏజెంట్‌కు ఒకరోజు ఒక యువతి ఫోన్ చేసింది. ఆ ఫోన్ చేసిన యువతి తనకు ఒక పాలసి కావాలని చెప్పింది. ఈ క్రమంలో నారాయణ్ సాహుతో వాట్సాప్‌లో వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అతని వాట్సాప్ నెంబర్ తీసుకుంది.  ఆ తరువాత వీడియో కాల్ చేసి నారాయణ్‌తో మాట్లాడుతూ తన బట్టలు విప్పేసింది. అదే సమయంలో వీడియో కాల్ స్క్రీన్ షాట్ తీసి నారాయణ్‌కు మెసేజ్ చేసింది. ఇది చూసిన నారాయణ్ సాహు ఖంగుతిన్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావని అతను అడిగాడు. 


దానికి ఆమె తనకు రూ.50,000 వెంటనే పంపాలని లేకపోతే రికార్డ్ చేసిన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసింది. కానీ నారాయణ్ సాహు ఆమె డిమాండ్‌కి ఒప్పుకోకపోవడంతో ఆ మోసగత్తె మరో ఎత్తు వేసింది. ఆ స్క్రీన్ షాట్ ఫొటోని సైబర్ పోలీసులకు పంపిస్తానని బెదిరించింది. అయినా నారాయణ్ సాహు ఆమె మాటలకు భయపడలేదు. ఆ మరుసటి రోజు నారాయణ్ సాహుకు మరో వ్యక్తి ఫోన్ చేశాడు. అతను ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పి.. నారాయణ్ సాహుకు వ్యతిరేకంగా ఫిర్యాదు వచ్చిందని చెప్పాడు. వెంటనే ఆమెతో సమస్య పరిష్కరించుకోవాలని.. లేకపోతే ఇంటికి వచ్చి అరెస్టు చేస్తామని హెచ్చారించాడు. 


నారాయణ్ సాహు కాస్త కంగారు పడినా.. అతని మాటలను నమ్మలేదు. వెంటనే సమీపంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగిన విషయాన్ని వివరించాడు. పట్నా పోలీసు సైబర్ విభాగం అతని ఫిర్యాదు నమోదు చేసుకొని.. ఫోన్ నెంబర్ల సహాయంతో ఆ మోసగత్తె, నకిలీ ఢిల్లీ పోలీసు కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-01-04T10:23:19+05:30 IST