Advertisement

ఆధునిక సౌకర్యాలతో సమీకృత మార్కెట్లు

Mar 6 2021 @ 00:40AM
మార్కెట్‌ ఏర్పాటు కోరకు స్థలంను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ రవి

మున్సిపాలిటీల్లోని స్థలాలను పరిశీలించిన కలెక్టర్‌ రవి

జగిత్యాల టౌన్‌, మార్చి 5: పట్టణాల్లో అన్ని హంగులు, ఆధునిక సౌ కర్యాలతో సమీకృత మార్కెట్‌ నిర్మాణాలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ రవి అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలో నటరాజ్‌ థియేటర్‌ చౌరస్తా, మార్కెట్‌ యార్డ్‌ ప్రాంతాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. సంబంధిత అధికా రులతో సమీకృత మార్కెట్‌ నిర్మాణం కోసం అవసరమయ్యే స్థలాలను గుర్తించి, పూర్తి నివేదికలను అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజేశం, స్థానిక సంస్థల అదనపు కలె క్టర్‌ అరుణశ్రీ, ఆర్డీవో మాధురి ఉన్నారు.

కోరుట్ల : పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద, సబ్‌స్టేషన్‌ ప్రాంతాలలో చే పడుతున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణాన్ని అదనపు కలెక్టర్‌ రాజేశం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఆరుణశ్రీతో కలిసి కలెక్టర్‌ రవి శుక్ర వారం పరిశీలించారు. సంబంధిత స్థలాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 14వ ఆర్థిక సంఘ నిదులతో నిర్మిస్తున్న కూర గాయల మార్కెట్‌ భవనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కోరు ట్ల, జగిత్యాల ఆర్‌డీఓలు వినోద్‌కుమార్‌, మాదురి, కమిషనర్‌ అయాజ్‌, తహసీల్దార్‌ సత్యానారాయణలతో పాటు ప్రజాప్రతినిదులు పా ల్గొన్నారు. 

రాయికల్‌ : రాయికల్‌ మున్సిపాలిటీలోని బస్టాండ్‌, ప్రభుత్వ ఆస్ప త్రి ఆవరణలోని ఖాళీ స్థలాన్ని కలెక్టర్‌ జి.రవి శుక్రవారం పరిశీలించా రు. విశాలమైన మార్కెట్‌ల నిర్మాణం కోసం రెండు ఎకరాలు లేదా ఒక టిన్నర ఎకరాలకు తగ్గకుండా ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు ఏ ర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజేశం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, మున్సిపల్‌ కమిషనర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మెట్‌పల్లి రూరల్‌ : సమీకృత మార్కెట్‌ యార్డు ఏర్పాటు కోసం ప ట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలోని స్థలాన్ని స్థాని క అధికారులతో కలిసి శుక్రవారం కలెక్టర్‌ రవి పరిశీలించారు. ఒకటిన్న ర ఎకరాల ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు మున్సిపల్‌ కమిషనర్‌, తహసీల్దార్‌, ఆర్డీవోలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజేశం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, ఆర్డీవోలు వినో ద్‌కుమార్‌, మాధురి, మున్సిపల్‌ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్‌, అయా జ్‌, తహసీల్దార్లు నీరటి రాజేశ్‌, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement