తిప్పర్తి ఎస్‌బీఐలో చోరీకి విఫలయత్నం

ABN , First Publish Date - 2022-05-17T06:51:26+05:30 IST

మండలకేంద్రంలోని ఎస్‌బీఐలో చోరీకి దుండగులు ఆదివారం రాత్రి విఫలయత్నం చేశారు. శనివారం, ఆదివారం బ్యాంకుకు వరుస సెలవులు కావడంతో పక్కా ప్రణాళికతో బ్యాంకు గోడకు రంధ్రం చేసి లొపలికి వెళ్లారు. బ్యాంకు తలుపులు మాత్రమే తీశారు.

తిప్పర్తి ఎస్‌బీఐలో చోరీకి విఫలయత్నం
బ్యాంకు వేసిన కన్నం

తిప్పర్తి, మే 16: మండలకేంద్రంలోని ఎస్‌బీఐలో చోరీకి దుండగులు ఆదివారం రాత్రి విఫలయత్నం చేశారు. శనివారం, ఆదివారం బ్యాంకుకు వరుస సెలవులు కావడంతో పక్కా ప్రణాళికతో బ్యాంకు గోడకు రంధ్రం చేసి లొపలికి వెళ్లారు. బ్యాంకు తలుపులు మాత్రమే తీశారు. నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించిన లాకర్లను మాత్రం తెరవలేకపోయారని బ్యాంకు సిబ్బంది తెలిపారు. నగదు అపహరణకు గురికాలేనందున సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలాన్ని శాలిగౌరారం సర్కిల్‌ ఇన్స్‌స్పెక్టర్‌ రాఘవరావు, ఏఎస్‌ఐ మట్టయ్య పరిశీలించారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. 

Updated Date - 2022-05-17T06:51:26+05:30 IST