ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

ABN , First Publish Date - 2022-06-30T20:00:13+05:30 IST

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు

ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 6 లోపు దరఖాస్తు ఫీజులు చెల్లించాలి. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సెకండియర్‌ పరీక్షలు ఉంటాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు జూలై 26-30 తేదీల్లో నిర్వహిస్తారు.




Updated Date - 2022-06-30T20:00:13+05:30 IST