ఇంటర్‌, డిగ్రీ ఫీజులు పైపైకి

ABN , First Publish Date - 2021-01-25T07:14:22+05:30 IST

కోరలు చాసిన కొవిడ్‌ ఇంకా సమసిపోలేదు. దీని భయం నుంచి జనం ఇప్పుడిప్పుడే బయట పడుతు న్నారు. ఈ సమయంలో బతకడానికి సంతృప్తి ఆదా యం లేని ప్రజలను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది.

ఇంటర్‌, డిగ్రీ ఫీజులు పైపైకి

గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో     40 శాతం అదనంగా ఫీజు బాదుడు  

దోపీడీయే ఎజెండాగా కొన్ని ప్రైవేట్‌ యాజమాన్యాలు 

ఫీజు నియంత్రణ కమిటీ ఏం చేస్తోందని నిలదీస్తున్న తల్లితండ్రులు

ఇంటర్‌ రెండేళ్ల కోర్సులకు, డిగ్రీ మూడేళ్ల కోర్సులు చదివే విద్యార్థులకు ప్రభుత్వం షాకిచ్చింది. గతేడాది చెల్లించిన ఫీజులకంటే అదనంగా ప్రభుత్వ కళాశాలల్లో 40 శాతం అదనంగా ఫీజు పెంచేసింది. ఫీజుల వసూళ్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ప్రైవేట్‌ యాజమాన్యాలను ఆదేశిస్తూ తదనుగుణంగా ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫీజు పెంచినప్పుడు,  నిబంధనలు పరిగణలోకి తీసుకుని తాము మాత్రం ఫీజులు తీసుకోలేమని తెగేసి చెప్పి మరీ ప్రైవేట్‌ యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

 కోరలు చాసిన కొవిడ్‌ ఇంకా సమసిపోలేదు. దీని భయం నుంచి జనం ఇప్పుడిప్పుడే బయట పడుతు న్నారు. ఈ సమయంలో బతకడానికి సంతృప్తి ఆదా యం లేని ప్రజలను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. ధరలను నియంత్రించాల్సి ఉంది. కేవలం రేషన్‌ డిపోల ద్వారా పెద్దఎత్తున సబ్సిడీ ఇచ్చి బియ్యం ఇస్తే సరిపోదు. పేద విద్యార్థుల అభీష్టం మేరకు వారు చేరే కోర్సులకు చెల్లించే ఫీజుల్లో పెద్ద మొత్తంలో రాయితీ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా అమ్మఒడి, విద్యా, వసతి దీవెన ఇస్తున్నామనే సాకుతో ప్రభుత్వ, ప్రైవేట్‌ జూని యర్‌, డిగ్రీ కళాశాలల్లో చేరే పేద విద్యార్థులపై ఫీజు ల భారం మోపింది. దీంతో ఇంటర్‌ మొదటి ఏడాది లో చేరేవారు, రెండో సంవత్పరంలోకి వెళ్లిన విద్యార్థుల పేద తల్లితండ్రులు ఫీజులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో జూనియర్‌ ప్రభుత్వ కళాశాలలు 42, ఎయిడెడ్‌ 13, ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు 226 ఉన్నాయి. డిగ్రీ కళాశాలల్లో ఎయిడెడ్‌ 10, అన్‌ఎయిడెడ్‌ 200, ప్రభుత్వ పరిధిలో 16 ఉన్నాయి. ఈ కళాశాలల్లో గత ఏడాది వందలాది మంది విద్యార్థులు చేరుతున్నారు. ఏడాది కాలం నుంచి కరోనా వైరస్‌ వల్ల అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. రెండు నెలల కిందట ఇవి నామమాత్రంగా తెరుచుకున్నాయి. కోర్టు కేసుల వల్ల మొన్నటి వరకు ప్రైవేట్‌ యాజమాన్య కళాశాలల్లో అడ్మిషన్లు జాప్యమయ్యా యి. ఇప్పుడిప్పుడే జోరందుకున్నాయి. అయితే తొలి దశలో ఇంటర్‌, డిగ్రీ ద్వితీయ ఏడాది తరగతులు ప్రారంభించారు. ఇటీవల మొదటి ఏడాది అడ్మిషన్లు ప్రారంభించి తరగతులు మొదలుపెట్టారు. 

ఇవీ ఇంటర్‌ ఫీజులు 

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ సైన్స్‌ గ్రూపునకు గతేడాది వార్షిక ఫీజు రూ.653 ఉండేది. ఈ ఏడాది రూ.1695కు పెంచారు. ఆర్ట్స్‌ గ్రూపులో మొన్నటివరకు రూ.319 కాగా, ఇప్పుడు రూ.1027 చేశారు. ఎయిడెడ్‌ కళాశాలల్లో సైన్స్‌ గ్రూపునకు రూ. 1559 ఉండగా రూ.1695 చేశారు. ఆర్ట్స్‌ గ్రూపులో రూ.952 ఉండగా రూ.1027కి పెరిగింది. 

డిగ్రీ ఫీజులు ఇలా..

గతేడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం కంప్యూటర్‌ కోర్సులో చేరిన విద్యార్థులు రూ.5,200 ఫీజు కట్టారు. ఇప్పుడు రూ.7,480, బీకాం జనరల్‌ విద్యార్థులు గతంలో రూ.2116 చెల్లించగా, ఇప్పుడు రూ. 4,186కి పెంచారు. కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న బీబీఎం డిజిటల్‌ మార్కెటింగ్‌ మూడేళ్ల కోర్సుకు గత విద్యాసంవత్సరంలో రూ.7,300 చెల్లించగా, ఇప్పు డు రూ.13,480 అయ్యింది. బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల ఫీజు పెద్దగా పెరగపోయినా, సైన్స్‌ కోర్సుల ఫీజు రెండింతలైంది. అయినా చెల్లించేందుకు ముందుకు వస్తున్నా విద్యార్థులకు సరిపడా సీట్లు ఖాళీ లేకపోవడం గమనార్హం. ఇక ఫీజు నియంత్రణా కమిటీ ఒకటుందని, బృంద సభ్యులు ఎప్పుడు ఏ సమయం లో తమ విద్యాసంస్థల్లో తనిఖీ చేస్తారో అనే భయం ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాల్లో కనిపించడం లేదు. దీంతో ఇంటర్‌లో గతేడాది మొదటి సంవత్సరానికి  బైపీసీ ఫీజు రూ.20 వేలు వసూలు చేయగా, ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.27 వేలు చేశారు. ఎంపీసీలో రూ.18 వేలు వసూలు చేయగా, ఇప్పుడు రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. పైగా మొదటి టర్మ్‌ఫీజులో 45 శాతం ఒకేసారి రూ.10 వేలు కట్టించుకుంటున్నారు. సీనియర్‌ ఇంటర్లో ప్రవేశించిన విద్యార్థులు వేరే కళాశాలకు వెళ్లకుండా గత నాలుగు నెలల నుంచే వారిని తమ లెక్చరర్‌ల ద్వారా కట్టడి చేశారు. ఫీజులు తగ్గిస్తామని నమ్మబలికారు. ఇప్పు డు వీరు ప్రభుత్వ నిబంధనలకు లోబడి చెల్లించాల్సిన వార్షిక ఫీజు రూ.20 వేలయితే, దీన్ని రూ.28 వేలకు పెంచారు. డిగ్రీ విద్యార్థులకైతే జిల్లాలో పేరుగాంచిన ప్రముఖ విద్యా సంస్థల మూడు యాజమాన్యాలు పోటాపోటీగా విద్యార్థుల నుంచి ఫీజు దోపిడీకి పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 

వసతుల లేమి..

ప్రైవేట్‌ కళాశాలల్లో ఉన్న మరుగుదొడ్లు బయట ఉన్న సామాజిక మరుగుదొడ్లకంటే దారుణంగా ఉంటున్నాయని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. వారానికోసారి కూడా శుభ్రం చేయించడం లేదని, వాష్‌రూంలకు వెళ్లాలంటే వాంతులు అవుతున్నాయని వారు వాపోతున్నారు. గత రెండు రోజుల కిందట ఫీజు నియంత్రణ రాష్ట్ర కమిటీ బృందం విజయవాడలో పలు ప్రైవేట్‌ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీ చేసి వాస్తవాలను నిగ్గు తేల్చారని, అదేవిధంగా ఈ జిల్లాలో ప్రధానంగా జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో తనిఖీ చేయాలని బాలికలు కోరుతున్నారు. 



Updated Date - 2021-01-25T07:14:22+05:30 IST