ప్రశాంతంగా ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-20T05:58:47+05:30 IST

ఇంటర్మీడియేట్‌ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్‌ పరీక్షలు
పరీక్ష రాస్తున్న విద్యార్థులు


- చివరి రోజు పరీక్షలకు 227 మంది విద్యార్థులు గైర్హాజరు

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, మే 19: ఇంటర్మీడియేట్‌ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో 8936 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కోసం జిల్లాలో 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వేసవి త్రీవత దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలను కలుగకుండా ఏర్పాట్లను చేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 4,474  మంది ఉండగా, రెండో సంవత్సరంలో 4,462 మంది ఉన్నారు. గురువారం ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలకు 4,104 మంది విద్యార్థులకు 3,877 మంది విద్యార్థులు హాజరు కాగా 227 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్‌ విభాగంలో 3,803 మంది విద్యార్థులకు 3,629 మంది విద్యార్థులు హాజరుకాగా 174 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 301 మంది విద్యార్థులకు 248 మంది విద్యార్థులు హాజరుకాగా 53 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగియడానికి కృషి చేసిన చీఫ్‌సూపరెంటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారులకు, ఇన్విజిలేటర్లకు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి సీహెచ్‌ మోహన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సుకు సంబంధించిన పరీక్షలు ఈ నెల 24తో ముగియనున్నాయని, వీరికి జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. బద్దెనపల్లిలోని సోషల్‌వెల్ఫేర్‌, వేములవాడలోని విద్యకళ జూనియర్‌ కళాశాల, గంభీరావుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, సిరిసిల్లలోని బాలికల జూనియర్‌ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు  డీఐఈవో మోహన్‌ తెలిపారు. 


Updated Date - 2022-05-20T05:58:47+05:30 IST