Arrest: ఇద్దరు అంతరాష్ట్ర దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2022-08-11T15:28:45+05:30 IST

తిరుపతి నగరం(Tirupati city), పరిసర ప్రాంతాల్లో ఇళ్ల ముందు పార్కుచేసి ఉన్న మోటార్‌ సైకిళ్లను చోరీ చేసిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను

Arrest: ఇద్దరు అంతరాష్ట్ర దొంగల అరెస్టు

                                 - 10 ద్విచక్ర వాహనాల స్వాధీనం 


తిరుచానూరు(చెన్నై), ఆగస్టు 10: తిరుపతి నగరం(Tirupati city), పరిసర ప్రాంతాల్లో ఇళ్ల ముందు పార్కుచేసి ఉన్న మోటార్‌ సైకిళ్లను చోరీ చేసిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీస్‏స్టేషన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ సుబ్రహ్మణ్యంరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. తమిళనాడు, నామక్కల్‌ పరమతి వేలూరు తాలూకాలోని సొలసిరామసి గ్రామానికి చెందిన దొరస్వామి మణికందన్‌ తంగావరాసు(32)సేలం జిల్లా తగదపట్టిగేటుకు చెందిన గోవిందన్‌పళని స్వామి (30)పాత నేరస్తులు. వీరు తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిద్దరూ తిరుచానూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇళ్ల ముందు పార్క్‌ చేసిన ద్విచక్రవాహనాలను చోరీ చేసే వారు. ద్విచక్రవాహనాల చోరీపై పలు పోలీస్‏స్టేషన్లలో కేసులు కూడా నమోద య్యాయి. ఈ క్రమంలో వీరిని పోలీసులు దామినేడు వద్ద అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ(DSP) తెలిపారు. నిందితుల నుంచి పది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పలు కేసుల్లో నిందితుడైన గోవిందన్‌ పళని స్వామి జైలు శిక్ష కూడా అనుభవించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్న సీఐ సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్‌ఐలు జగన్నాథ్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

Updated Date - 2022-08-11T15:28:45+05:30 IST