ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ABN , First Publish Date - 2022-06-25T17:28:05+05:30 IST

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆగస్టు 3 నుంచి 12 వరకు.. ఉదయం 9 నుంచి 12గంటల వరకు...

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

అమరావతి: ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. దీని ప్రకారం.. ఆగస్టు 3 నుంచి 12 వరకు.. ఉదయం 9 నుంచి 12గంటల వరకు... మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు అదే నెలలో 17 నుంచి 22 వరకు జరుగుతాయి. సాధారణ కోర్సులకు రూ.500, ఒకేషనల్‌ కోర్సులకు రూ.700, బ్రిడ్జి కోర్సులకు రూ.145 చొప్పున ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రథమ, ద్వితీయ రెండు సంవత్సరాల విద్యార్థులు జూలై 7లోగా ఫీజులు చెల్లించాలి. సాధారణ, ఒకేషనల్‌ రెండింటిలోనూ ప్రైవేటు విద్యార్థులకు ఫీజుల నుంచి మినహాయింపునిచ్చింది. ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారికి ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

Updated Date - 2022-06-25T17:28:05+05:30 IST