వడ్డీ ఆశ చూపించి మోసం

ABN , First Publish Date - 2021-03-01T13:57:00+05:30 IST

కొద్ది రోజులు వడ్డీ చెల్లించిన వ్యాపారి తరువాత ఇవ్వడం మానేశాడు...

వడ్డీ ఆశ చూపించి మోసం

హైదరాబాద్/రెజిమెంటల్‌బజార్‌ : ఓ వ్యక్తి వడ్డీ ఆశ చూపించి మోసం చేశాడని బాధితులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లో జువెలరీ షాపు నిర్వహిస్తున్న హస్తిమల్‌ జైన్‌ వడ్డీ ఆశ చూపడంతో పలువురు అతడి వద్ద డబ్బులు డిపాజిట్‌ చేశారు. కొద్ది రోజులు వడ్డీ చెల్లించిన వ్యాపారి తరువాత ఇవ్వడం మానేశాడు. తన వద్ద డిపాజిట్‌ చేసిన డబ్బులు తిరిగి ఇస్తానని రాతపూర్వకంగా రాసి ఇచ్చి ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తూ అతడి షాపు ఎదుట ఆదివారం ఆందోళన చేశారు. బాధితులు రేమండ్‌ అబ్రహాం, జోసెఫ్‌ విజయ్‌కుమార్‌, విశ్వేష్‌ ఠాగూర్‌, ప్రేమ్‌ చౌదరి, కిరణ్‌, రాజేష్‌, రాజ్‌కుమార్‌, నర్సమ్మ, సహేరా ఖాన్‌, సరితాబాయి, అరుంధతి,  నజీరా బేగం విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద కోట్ల రూపాయల డబ్బు తీసుకున్న వ్యాపారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల నుంచి తమకు ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు.

Updated Date - 2021-03-01T13:57:00+05:30 IST