
అమరావతి: సభ వాయిదా సమయంలో శాసనమండలి లాబీల్లో వైసీపీ, బీజేపీ ఎమ్మెల్సీల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. అలాగే మంత్రులు కూడా మధ్యలో జోక్యం చేసుకున్నారు. ఇప్పటంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగంపై చర్చ జరిగింది. పవన్‌కల్యాణ్‌కు బీజేపీ ఎప్పుడు రూట్‌మ్యాప్ ఇస్తుందని వైసీపీ మంత్రులు ప్రశ్నించారు. దీనికి బీజేపీ ఎమ్మెల్సీలు ధీటుగా సమాధానం చెప్పారు. మీరు ముందు రోడ్లు వేయండి.. అప్పుడు రూట్‌మ్యాప్‌తో తాము బయలుదేరతామని ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్ ఎదురు సమాధానం ఇచ్చారు. రోడ్లు వేయకపోవడంవల్లే ప్రజలు ప్రాణాలు పోతున్నాయని వాకాటి చురకలంటించారు. పవన్ ప్రసంగంలో వెల్లంపల్లి, అవంతిపై వేసిన సెటైర్లపై సరదా సంభాషణలు కొనసాగింది. ఇద్దరు మంత్రులను చూసిన వెంటనే నవ్వుతూ మిగతా మంత్రులు పలకరించారు. పవన్ ప్రసంగం, భవిష్యత్ రాజకీయ వ్యూహంపైనే లాబీల్లో విస్తృత చర్చలు జరిగాయి.
ఇవి కూడా చదవండి