322 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..!

ABN , First Publish Date - 2021-12-17T17:17:47+05:30 IST

ఇంటర్ విద్యార్హతతో..

322 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..!

Indian Coast Guardలో 322 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ల్లో కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది.


పోస్టులు- ఖాళీలు

నేవిక్‌(జనరల్‌ డ్యూటీ): 260

నేవిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్‌): 35

యాంత్రిక్‌(మెకానికల్‌): 13

యాంత్రిక్‌(ఎలక్ట్రికల్‌): 09

యాంత్రిక్‌(ఎలక్ట్రానిక్స్‌): 05


అర్హత, వయసు:

నేవిక్‌(జనరల్‌ డ్యూటీ): మేథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత

వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. 2000 ఆగస్టు 1 నుంచి 2004 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.


నేవిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్‌): గుర్తింపు పొంది ఎడ్యుకేషనల్‌ బోర్డుల నుంచి పదోతరగతి ఉత్తీర్ణత

వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. 2000 అక్టోబరు 1 నుంచి 2004 సెప్టెంబరు 30 మధ్య జన్మించి ఉండాలి


యాంత్రిక్‌: గుర్తింపు పొందిన ఎడ్యుకేషనల్‌ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌(రేడియో/పవర్‌)ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత - ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ  వయోపరిమితి నిబంధనలో సడలింపు ఉంటుంది.


ఎంపిక: వివిధ దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా సెక్షన్‌-1, 2, 3, 4, 5 పరీక్షలు నిర్వహిస్తారు. ఏ పోస్టులకు ఏ సెక్షన్‌ పరీక్షను నిర్వహిస్తారు, దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కు లు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్‌, పరీక్ష సమయం, అడిగే ప్రశ్నలు తదితర పూర్తి సమాచారం నోటిఫికేషన్‌లో ఇచ్చారు.

స్టేజ్‌-2: మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌లో కనబరచిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌ జాబితా తయారు చేస్తారు. దీని ప్రకారం స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. ఇందులో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, రీ అసె్‌సమెంట్‌ టెస్ట్‌, తొలి మెడికల్‌ టెస్ట్‌ ఉంటాయి.

స్టేజ్‌-3: స్టేజ్‌-1, స్టేజ్‌-2లో కనబరచిన ప్రతిభ ఆధారంగా స్టేజ్‌-3కి ఎంపిక చేస్తారు. ఇందులో ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ఫైనల్‌ మెడికల్‌ టెస్ట్‌, పోలీస్‌ వెరిఫికేషన్‌ ఉంటాయి.

స్టేజ్‌-4: ఇందులో వివిధ ఎడ్యుకేషన్‌ బోర్డులు/యూనివర్సిటీలు/రాష్ట్ర ప్రభుత్వ నుంచి పొందిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ముందు ఉంచాలి. సర్టిఫికెట్లు ఒకవేళ జన్యూన్‌గా లేకపోతే టర్మినేట్‌ చేస్తారు.


ముఖ్యసమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.250(ఎస్సీ/ఎస్టీలకు ఫీజు లేదు)

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 04

చివరి తేదీ: జనవరి 14

వెబ్‌సైట్‌: joinindiancoastguard.cdac.in/



Updated Date - 2021-12-17T17:17:47+05:30 IST