బోరిస్ రాజీనామాపై స్పందించిన India

ABN , First Publish Date - 2022-07-08T01:20:33+05:30 IST

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామాపై భారత ప్రభుత్వం స్పందించింది. ప్రధాని నరేంద్రమోదీ, బోరిస్ జాన్సన్

బోరిస్ రాజీనామాపై స్పందించిన India

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) రాజీనామాపై భారత ప్రభుత్వం స్పందించింది. ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi), బోరిస్ జాన్సన్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి (Arindam Bagchi) తెలిపారు. బోరిస్ రాజీనామా తదనంతర పరిణామాలు బ్రిటన్ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. యూకేతో తమకు బహుముఖ సంబంధం ఉందని, భవిష్యత్‌లోనూ అది కొనసాగుతుందన్నారు. నాయకత్వ మార్పుపై తాము స్పందించబోమని బాగ్చి స్పష్టం చేశారు. 


కాగా, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్ తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. ఇందుకోసం ఆయన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబరునాటికి నూతన ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. మూడేళ్లపాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన జాన్సన్ తాజాగా జాతినుద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ పదవిని వదులుకున్నట్టు చెప్పారు. ప్రధానమంత్రిగా తన వైఫల్యాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన విజయాల పట్ల మాత్రం గర్వపడుతున్నానని తెలిపారు.   


Updated Date - 2022-07-08T01:20:33+05:30 IST