International డ్రగ్స్‌ పెడ్లర్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-05-08T17:27:58+05:30 IST

నగరంలో అంతర్జాతీయ డ్రగ్స్‌ పెడ్లర్‌‎ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వ్యాపారి ఆశీష్‌ జైన్‌ ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు

International డ్రగ్స్‌ పెడ్లర్‌ అరెస్ట్‌

హైదరాబాద్: నగరంలో అంతర్జాతీయ డ్రగ్స్‌ పెడ్లర్‌‎ను Narcotic Control Bureau అధికారులు అరెస్ట్ చేశారు. వ్యాపారి ఆశీష్‌ జైన్‌ ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు నిర్వహించింది. రూ.3.71 కోట్ల నగదును ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫార్మసీ ముసుగులో ఆశీష్‌ జైన్‌ డ్రగ్స్‌ దందా చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌ ఫార్మసీ, జేఆర్‌ ఇన్‌ఫినిటీ పేరుతో వ్యాపారం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో నిందితుడు ఆశీష్ అమెరికాకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. గత రెండేళ్లలో వెయ్యికి పైగా డ్రగ్స్‌ ఆర్డర్లను పంపినట్లు సమాచారం. ఆశీష్‌ నుంచి కీలక సమాచారం ఎన్‌సీబీ సేకరించింది. బిట్‌కాయిన్స్‌, క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించింది. 

Read more