ఏడాది చివరికల్లా.. అందుబాటులోకి అంతర్జాతీయ విమాన సర్వీసులు!

ABN , First Publish Date - 2021-11-25T03:01:18+05:30 IST

అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రావొచ్చని విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా గతేడాది

ఏడాది చివరికల్లా.. అందుబాటులోకి అంతర్జాతీయ విమాన సర్వీసులు!

ఎన్నారై డెస్క్: అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రావొచ్చని విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా గతేడాది ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు, అత్యవసర సరుకుల రవాణా కోసం ప్రభుత్వం కొన్ని విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అయితే కేసులు తగ్గుముఖం పట్టడం, టీకా కార్యక్రమం సజావుగా సాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ విమాన సర్వీసులను సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రక్రియపై కేంద్రం దృష్టిసారించిందని గత వారం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా వెల్లడించిన విషయం తెలిసిందే. 




Updated Date - 2021-11-25T03:01:18+05:30 IST