27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2022-03-09T12:47:57+05:30 IST

కొవిడ్‌ వల్ల రద్దు చేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈ నెల 27వ తేదీ నుంచి పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సర్వీసులు సరిగ్గా రెండేళ్ల తర్వాత ప్రారంభం కానున్నా యి. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యం

27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయి పునరుద్ధరణ

న్యూఢిల్లీ, మార్చి 8: కొవిడ్‌ వల్ల రద్దు చేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈ నెల 27వ తేదీ నుంచి పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సర్వీసులు సరిగ్గా రెండేళ్ల తర్వాత ప్రారంభం కానున్నా యి. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో 2020 మార్చి 23న అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. 2020 జూలై నుంచి 37 దేశాలకు సర్వీసులను అనుమతించారు. తాజాగా కొవిడ్‌ వ్యాప్తి తగ్గడం, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ విస్తృతంగా సాగడంతో అంతర్జాతీయ సర్వీసులను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం స్పైస్‌ జెట్‌ అందరూ మహిళా సిబ్బందితో 10 విమానాలను నడిపింది. ఇందులో హైదరాబాద్‌-తిరుపతి, తిరుపతి-హైదరాబాద్‌ మధ్య నడిచిన సర్వీసులు కూడా ఉండడం విశేషం.

Updated Date - 2022-03-09T12:47:57+05:30 IST