నగర ఆహార సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు

ABN , First Publish Date - 2022-01-29T14:48:56+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌, వినోదం, ఐటీ తదితర సెక్టార్లు సంఘటితం కావడం ద్వారా కలిసి పనిచేసేందుకు మంచి అవకాశాలుంటాయని ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజ న్‌ అన్నారు.

నగర ఆహార సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ: రియల్‌ ఎస్టేట్‌, వినోదం, ఐటీ తదితర సెక్టార్లు సంఘటితం కావడం ద్వారా కలిసి పనిచేసేందుకు మంచి అవకాశాలుంటాయని ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజ న్‌ అన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో శుక్రవారం నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండి యా హైదరాబాద్‌ చాప్టర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. నగరంలో రెస్టారెంట్‌ ఇండస్ట్రీకి సంబంధించి చురుకైన పాత్ర పోషిస్తున్న వారితో ఈ చాప్టర్‌ ఏర్పాటు కావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. నగరంలోని ఆహార సంస్కృతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని, ఇక్కడి రెస్టారెంట్లు రుచి, వెరైటీలను అందుబాటులో ఉంచడం ద్వారా నగరానికి గ్లోబల్‌ సిటీగా ఆదరణ ఉంటుందన్నారు. ఇలాంటి తరుణంలో ఆర్గనైజేషన్‌కు సంబంధించి ప్రత్యేక చాప్టర్‌ ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. నగరానికి ఆతిధ్య రంగంలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం సహకారమందిస్తుందన్నారు. 


హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌కు ప్రత్యేక గుర్తింపు

విభిన్న పార్శ్వాలను చూపే హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయే్‌షరంజన్‌ అన్నారు. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్ట్‌ 12వ ఎడిషన్‌ను శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఫెస్ట్‌ షెడ్యూల్‌ అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఫెస్ట్‌లో ఒక్కో ఏడాది ఒక్కోదేశం, ఒక్కో భారతీయ భాషకు ప్రచారం కల్పించడం మంచి విషయమన్నారు. ఈ ఏడాది ఫెస్ట్‌లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)ను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.

Updated Date - 2022-01-29T14:48:56+05:30 IST