పురుషుల దినోత్సవం కూడా జరపాలి: బీజేపీ మహిళా ఎంపీ

ABN , First Publish Date - 2021-03-08T21:26:32+05:30 IST

అనేక దినోత్సవాల మాదిరిగానే పురుషుల దినోత్సవం ఒకటి ప్రకటించాని స్వల్పంగానయినా వినిపిస్తుంటాయి. అయితే చట్ట సభల్లో ఇలాంటి ప్రతిపాదనలు ఎప్పుడూ వినిపించవు. ఒక మహిళా ఎంపీ, అది కూడా మహిళా

పురుషుల దినోత్సవం కూడా జరపాలి: బీజేపీ మహిళా ఎంపీ

న్యూఢిల్లీ: ప్రపంచ మహిళా దినోత్సవంతో పాటు ‘ప్రపంచ పురుషుల దినోత్సవం’ నిర్వహించాలని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ సోనాల్ మాన్‌సింగ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సోమవారం ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ ‘‘మనం స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా మెన్స్ డే ని కూడా ఎందుకు పాటించకూడదు?’’ అని ప్రశ్నించారు.


ఉత్తర అమెరికా, యూరప్‌లలో జరిగిన కార్మిక పోరాటాల ఫలితంగా 1977లో మార్చి 8వ తేదీని ప్రపంచ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే పురుషుల దినోత్సవం అనే అధికారిక తేదీని ప్రకటించకపోయినప్పటికీ నవంబర్ 19వ తేదీని పురుషుల దినోత్సవంగా అక్కడక్కడా కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ ప్రతిపాదన ఐక్యరాజ్యసమితి దృష్టికి సైతం వెళ్లింది. అయితే ఈ విషయమై తగిన చర్చ జరగక ఆగిపోయిందని కొందరు చెప్తుంటారు.


కాగా, అనేక దినోత్సవాల మాదిరిగానే పురుషుల దినోత్సవం ఒకటి ప్రకటించాని స్వల్పంగానయినా వినిపిస్తుంటాయి. అయితే చట్ట సభల్లో ఇలాంటి ప్రతిపాదనలు ఎప్పుడూ వినిపించవు. ఒక మహిళా ఎంపీ, అది కూడా మహిళా దినోత్సవం రోజునే పురుషుల దినోత్సవం ప్రటించాలని డిమాండ్ చేయడంతో చర్చనీయాంశమైంది. క్లాసికల్ డాన్సర్ అయిన ఆయిన ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ ‘‘కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో మహిళా నాయకత్వంలో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడుతూనే సమానమైన భవిష్యత్తును, పునరుద్ధరణను రూపొందించడంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు చేసిన అద్భుతమైన ప్రయత్నాలను అభినందించాలి. అయితే ఈ సమయంలో పురుషులతో పోల్చుకుంటే మహిళలు ఎక్కువ శాతం ఉద్యోగాలు కోల్పోయారు. స్కిల్, డిజిటల్ పరిజ్ణానంతో వారిని మరింత తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.

Updated Date - 2021-03-08T21:26:32+05:30 IST