కోనసీమలో Internet సేవలు ఇప్పట్లో కష్టమే

ABN , First Publish Date - 2022-06-03T01:25:55+05:30 IST

కోనసీమలో ఇంటర్నెట్ (Internet) సేవలు ఇప్పట్లో పునరుద్ధరించేలా కనిపించడం లేదు. మరో రెండ్రోజులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కోనసీమలో Internet సేవలు ఇప్పట్లో కష్టమే

అమలాపురం: కోనసీమలో ఇంటర్నెట్ (Internet) సేవలు ఇప్పట్లో పునరుద్ధరించేలా కనిపించడం లేదు. మరో రెండ్రోజులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి విమర్శలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అమలాపురం అల్లర్ల కేసులో మరో 20 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 91కి అరెస్టుల సంఖ్య చేరింది. అమలాపురం అల్లర్లతో ఏప్రిల్‌ 24 నుంచి ఇంటర్నెట్ బంద్‌ చేశారు. కోనసీమకు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లా అమలాపురంలో మే 24వ తేదీన అల్లర్లు జరిగాయి. మంత్రి విశ్వరూప్‌, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇళ్లను దహనం చేశారు. ఈనేపథ్యంలో మే 25వ  తేదీ నుంచి కోనసీమలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. దీంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోనసీమవ్యాప్తంగా భద్రతా బలగాలను మోహరించారు. ఇంకా 144 సెక్షన్‌ అమల్లో ఉంది. పోలీసుల నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. వదంతులు వ్యాప్తిచెందకుండా ఇంటర్నెట్‌ సేవల బంద్‌ చేశారు. అల్లర్లు, విధ్వంసానికి కారకులైన వారి ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. నెట్‌ సేవలు బంద్‌ అయినప్పటికీ వదంతుల విస్తృత వ్యాప్తి పోలీసులకు సవాల్‌గానే మారాయి. 

Updated Date - 2022-06-03T01:25:55+05:30 IST