హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ సర్వీసులు డౌన్...

Jun 15 2021 @ 15:21PM

హైదరాబాద్ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  సర్వీసుల్లో అంతరాయమేర్పడింది. మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులు డౌన్ అయ్యాయి. దీంతో కస్టమర్లపై ప్రభావం పడింది. ట్విట్టర్ వేదికగా... హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కమ్యూనికేషన్ టీమ్  ఈ విషయాన్ని వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి. 


‘మొబైల్ బ్యాంకింగ్ యాప్‌కు సంబంధించి సమస్యలు తలెత్తాయి. దీనిపై పని చేస్తున్నాం. ఖాతాదారులు... లావాదేవీల నిర్వహణ కోసం నెట్ బ్యాంకింగ్ ఉపయోగించాలి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కమ్యూనికేషన్ బ‌ృందం ఈ సందర్భంగా వెల్లడించింది.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.