Hyderabad: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-09-14T15:55:33+05:30 IST

వందకు పైగా దొంగతనాలకు పాల్పడి జైలుశిక్ష అనుభవించడమే కాకుండా, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నాచారం పోలీసులు

Hyderabad: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

హైదరాబాద్/ఉప్పల్‌: వందకు పైగా దొంగతనాలకు పాల్పడి జైలుశిక్ష అనుభవించడమే కాకుండా, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను నాచారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ రక్షితామూర్తి మంగళవారం విలేకరులకు వెల్లడించారు. నాగర్‌కర్నూలు జిల్లా, ఉప్పునూతన మండలం, ఆవులోనిబాయి గ్రామానికి చెందిన ఆవుల కిరణ్‌ (33) తుర్కయాంజాల్‌, ఇందిరమ్మ కాలనీ పదో నంబరు రోడ్డులో మొబైల్‌ షాపు నిర్వహిస్తున్నాడు. సంపాదన కుటుంబపోషణకు సరిపోకపోవడంతో దొంగతనాల బాట పట్టాడు. తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీ్‌సస్టేషన్ల పరిధిలో వందకు పైగా దొంగతనాలు చేశాడు. దోచుకున్న సొత్తుతో అధునాతన ఇల్లు నిర్మించుకొని జల్సా చేస్తున్నాడు. పోలీసులు ఇతడిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపారు.


బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో నాచారం, వీరారెడ్డినగర్‌ కాలనీ, సాయిదర్శన్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న చిట్టి వెంకట రమణమూర్తి ఇంటి తాళాలు పగులగొట్టి వెండి, బంగారు నగలు దోచుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిరణ్‌ను అదుపులోకి తీసుకొని రూ.7 లక్షల విలువ చేసే చోరీ సొత్తు, కారు, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో నాచారం ఇన్‌స్పెక్టర్‌ టి.కిరణ్‌కుమార్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.నాగరాజు, ఏఎ్‌సఐ నరసింహారావు, మల్కాజిగిరి సీసీఎస్‌ టీం సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-14T15:55:33+05:30 IST