ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు ఇంటర్వ్యూలు

Jun 14 2021 @ 23:21PM
ఆసిఫాబాద్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు

ఆసిఫాబాద్‌, జూన్‌ 14: ఆర్థికసంవత్సరం 2020-21  గాను సబ్సిడీ రుణాల మంజూరుకు సోమవారం స్కిల్డ్‌ (సాంకేతిక నైపుణ్యత) కేటగిరి కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జిల్లాకేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తా మని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యనిర్వహక సంచాకుడు జి సజీవన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాలో ఆసిఫాబాద్‌, కెరమెరి, జైనూరు, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, వాంకిడి మండలాలకు చెందిన 258మంది దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూ లకు 136మంది హాజరైనట్లు తెలిపారు. కార్యక్ర మంలో డీఆర్డీఏ పీడీ రవికృష్ణ, ఎల్‌డీఎం రామయ్య, ఏఎంవీఐ ఫహిమా సుల్తానా, డీఐసీ రఘు తదిత రులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌లో..

కాగజ్‌నగర్‌: ఎస్సీల రుణాల మంజూరు కోసం సోమవారం మున్సిపాల్టీ కార్యాలయంలో ఇంట ర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు బ్యాంకుల మేనేజర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం ఇంటర్వ్యులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బ్యాంకు అధికారులు పూర్తి స్థాయిలో దరఖాస్తును పరిశీలించినట్టు పేర్కొన్నారు.

Follow Us on: