మినీ ట్రక్కుల కోసం నేడు ఇంటర్వ్యూలు

ABN , First Publish Date - 2020-12-04T04:59:20+05:30 IST

ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం రాయితీపై అందజేనున్న మినీ ట్రక్కుల కోసం నేడు జిల్లావ్యాప్తంగా ఇంటర్వ్యూలు నిర్వహించ నున్నారు.

మినీ ట్రక్కుల కోసం నేడు ఇంటర్వ్యూలు

కలెక్టరేట్‌ :  ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీ  నిమిత్తం ప్రభుత్వం రాయితీపై అందజేనున్న మినీ ట్రక్కుల కోసం నేడు జిల్లావ్యాప్తంగా ఇంటర్వ్యూలు నిర్వహించ నున్నారు. జిల్లావ్యాప్తంగా 398 యూనిట్లకు 7వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఆయా దరఖాస్తుదారులకు  ఇంటర్వ్యూలు నిర్వహించి,  ఈనెల 5న ఎంపికైన వారిని ప్రకటిస్తారు. వీటికి తీవ్ర పోటీ ఉండడంతో దరఖాస్తు చేసుకున్న  వారు నేతల సిఫారసు కోసం క్యూ కడుతున్నారు. బీసీ కార్పొషన్‌ నుంచి 298 వాహనాలు కాగా 5,550 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఈబీసీ ద్వారా 27 యూనిట్లకు 35 మంది, ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 67 యూనిట్లకు 1480 మంది, మైనార్టీ శాఖ నుంచి  3 యూనిట్లకు 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా దరఖాస్తుదారుల్లో అర్హులను ఎంపిక చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.  దీని ప్రకారం ఎంపీడీవో అధ్యక్షుడిగా ఉంటారు. బ్యాంకు మేనేజరు, రవాణా శాఖ నుంచి ఒకరు, కార్పొరేషన్ల అధికారి  సభ్యులు గా ఉంటారు. ఆయా మండల స్థాయిలో ఉన్న కమిటీ ఆధ్వర్యంలోని ఇంటర్వ్యూలు జరుగు తాయని  బీసీ కార్పొరేషన్‌ ఈడీ నాగరాణి  తెలిపారు.

 

Updated Date - 2020-12-04T04:59:20+05:30 IST