జిల్లాలో ఇంటింటా ఆరోగ్య సర్వే : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-06T05:30:00+05:30 IST

వెయ్యి టీములతో గ్రామాలు, మున్సిపాలిటీ వార్డులలో ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్యసర్వేను చేపట్టినట్లు కలెక్టర్‌ శరత్‌ తెలిపారు.

జిల్లాలో ఇంటింటా ఆరోగ్య సర్వే : కలెక్టర్‌
దేవునిపల్లిలో సర్వే ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి టౌన్‌, మే 6: వెయ్యి టీములతో గ్రామాలు, మున్సిపాలిటీ వార్డులలో ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్యసర్వేను చేపట్టినట్లు కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. గురు వారం కలెక్టర్‌ దేవునిపల్లిలోని 10వ వార్డులో వైద్యబృందాలు నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వేను, సర్వేలో నమోదు చేసుకుంటున్న వివరాల రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వైద్యులు, ఏఎన్‌ఎం, ఆశా సిబ్బందితో కూడిన వెయ్యి టీములతో ఆరోగ్య బృందాలు ప్రజల ఆరోగ్య పరిస్థితులను నమోదు చేస్తున్నాయని తెలిపారు. గురువారం 25వేల మం దిని సర్వే చేయడం జరిగిందని, లక్షణాలతో ఉన్నవారికి మందుల కిట్స్‌ అందిస్తు న్నారని, కిట్స్‌ పొందిన వారు తప్పని సరిగా మందులు వాడాలని, అనారోగ్యం నుం చి కాపాడుకోవాలని కోరారు. వైద్య బృందాలు సలహాలు అందించేందుకు తమ ఫోన్‌ నెంబర్లను అందజేస్తున్నారని, మెడికల్‌ ఆఫీసర్లు ఎళ్లవేలలా అందుబాటులో ఉంటారని, నాలుగైదు రోజుల్లో తగ్గకపోతే ఫోన్‌ ద్వారా తమ ఆరోగ్య పరిస్థితులను వివరించి చికిత్స పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ సుజాయత్‌ అలీ, సుస్మితారాయ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరులో..
భిక్కనూరు: మండల కేంద్రం భిక్కనూరుతో పాటుగా మండలంలోని ఆయా గ్రామాల్లో భిక్కనూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్ర సిబ్బంది గురువారం ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ప్రతీ ఇంటికి వెళ్లి ఏమై నా జ్వరం, దగ్గు, విరేచనాలు, ఒంటి నొప్పులు ఉన్నాయా?, ఏమైనా కొవిడ్‌ లక్ష ణాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి కొవిడ్‌ కిట్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారు క్వారైంటైన్‌లో ఉండాలని వైద్య సిబ్బంది సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీనివాస్‌, ఎంపీపీ గాల్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాలకవర్గం సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
లింగంపేటలో..
లింగంపేట: మండలంలోని లింగంపేట, పొల్కంపేట, ముస్తాపూర్‌ గ్రామాల్లో గురువారం వైద్యఆరోగ్య శాఖ, పంచాయతీ సిబ్బంది ఇంటింటా జ్వరం సర్వేను నిర్వ హించారు. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంతో సర్వే ద్వారా ఎంత మందికి కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుని వారికి తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి రవీందర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు లావణ్య, పద్మ, మమతలతో పాటు ఏఎన్‌ ఎమ్‌లు పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
దోమకొండలో..
దోమకొండ: మడలంలోని  అన్ని గ్రామాల్లో గురువారం ఆరోగ్య సిబ్బంది పర్య ంటించి ప్రజల ఆరోగ్య సమస్యలను నమోదు చేశారు. గ్రామంలో ఆశ కార్యకర్తలు, అయాలు, వీఆర్‌ఏల బృందం గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గాంధారిలో..
గాంధారి: మండలంలో రెవెన్యూ అధికారులు, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో మాత్‌సంగెంతో పాటు పలు గ్రామాల్లో తహసీల్ధార్‌ సంగమేశ్వర్‌, రెవెన్యూ, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌  ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ప్రతీ ఇంటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్యపరిస్థితిని నమోదు చేసుకుంటూ మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు.
బీబీపేటలో..
బీబీపేట: మండల కేంద్రంతో పాటు, యాడారం గ్రామంలో ఇంటింటి సర్వేను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, బాలకృష్ణగౌడ్‌ నిర్వహించారు. ప్రజలకు జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు వంటి కరోనా లక్షణాలపై ఆరా తీస్తున్నారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్‌ తేలు లక్ష్మీ, సత్యనారాయణ, వెంకట్‌రావు, ఉప సర్పంచ్‌ సాయి నాథ్‌, హరీష్‌, ఆశ,అంగన్‌వాడి కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
సదాశివనగర్‌లో..
సదాశివనగర్‌: మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, వీఆర్‌ఏలు ఇంటింటికి వెళ్లి ప్రతీ ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని అడిగి వివరాలను నమోదు చేసుకున్నారు.
బాన్సువాడలో..
బాన్సువాడ టౌన్‌: బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఆరోగ్యసిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మెన్‌ జంగం గంగాధర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టి కుటుంబీకుల ఆరోగ్య వివరాలను తెలుసుకుని నమోదు చేశారు. ఈ సర్వేకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ రమేష్‌, అంగన్‌వాడీ, ఆశ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దకొడప్‌గల్‌లో..
పెద్ద కొడప్‌గల్‌: మండలంలోని అంజనీ గ్రామ ంలో వైద్య సిబ్బంది, రెవెన్యూ అఽధికారులు, సిబ్బం ది, ప్రజా ప్రతినిధులు కలిసి ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగు తూ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసు కుని, ఆరోగ్యస్థితి గతులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌ వాడీలు. వీఆర్‌ఏ తదితరులున్నారు.  
నిజాంసాగర్‌లో..
నిజాంసాగర్‌: మండలంలోని అచ్చంపేట, బం జాపల్లి, సుల్తాన్‌నగర్‌లో సర్వేను తహసీల్దార్‌ వేణుగోపాల్‌ పరిశీలించారు. అంగన్‌వాడీ, ఆశ వర్కర్లతో పాటు వీఆర్‌ఏలు ఇంటింటా సందర్శించి కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, అంగన్‌వాడీ, ఆశ వర్కర్లున్నారు.
కంఠాలిలో..
జుక్కల్‌: మండలంలోని కంఠాలిలో ఇంటింటా సర్వే చేపట్టినట్లు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచించారు. సర్పంచ్‌ శాంతాబాయి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బ ంది, రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు.

Updated Date - 2021-05-06T05:30:00+05:30 IST