వాట్సా‌ప్‎లో పరిచయం..డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌

ABN , First Publish Date - 2022-06-21T15:37:27+05:30 IST

వాట్సా‌ప్‎లో పరిచయం అయ్యారు. రహస్య ఫొటోలను షేర్‌ చేసుకున్నారు. వాటిని ఇంటర్నెట్‌లో పెడతామని సైబర్‌ నేరగాళ్లు యువకుడిని

వాట్సా‌ప్‎లో పరిచయం..డబ్బు కోసం బ్లాక్‌మెయిల్‌

హైదరాబాద్/బంజారాహిల్స్‌: వాట్సా‌ప్‎లో పరిచయం అయ్యారు. రహస్య ఫొటోలను షేర్‌ చేసుకున్నారు. వాటిని ఇంటర్నెట్‌లో పెడతామని సైబర్‌ నేరగాళ్లు యువకుడిని బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు కాజేశారు. ఫిలింనగర్‌ హిలియోస్‌ బాయ్స్‌ హాస్టల్‌లో ఉంటున్న తాటి వెంకట్‌ అఖిల్‌ అమ్మాయిల కోసం డేటింగ్‌ యాప్‌లో సెర్చ్‌ చేస్తుండగా ఓ వాట్సాప్‌ నెంబర్‌ కనిపించడంతో మెసేజ్‌ చేశాడు. ఓ మహిళ లైన్‌లోకి వచ్చింది. ఇద్దరూ వాట్సాప్‌ కాల్‌ చేసుకొని రహస్య ఫొటోలు షేర్‌ చేసుకున్నారు. ఆ ఫొటోలను నెట్‌లో పెడతామని కొంతమంది సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేస్తూ యువకుడి నుంచి రూ. 11 వేలు కాజేశారు. సైబర్‌ నేరగాళ్లు బెదిరిస్తుండడంతో బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

Updated Date - 2022-06-21T15:37:27+05:30 IST