ప్రపంచ గతిని మార్చిన ఈ 10 ఆవిష్కరణల గురించి మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-03-06T17:38:04+05:30 IST

ఆధునిక ఆవిష్కరణలు మార్పు కంటే మెరుగైన...

ప్రపంచ గతిని మార్చిన ఈ 10 ఆవిష్కరణల గురించి మీకు తెలుసా?

ఆధునిక ఆవిష్కరణలు మార్పు కంటే మెరుగైన జీవితానికి దారి చూపిస్తాయి. నూతన ఆవిష్కరణలు, సాంకేతికతలు మన జీవితాన్ని సమూలంగా మార్చివేశాయి.  ప్రపంచాన్ని ఎంతగానో మార్చివేసిన వందలాది ఆవిష్కరణలలో 10 ఆవిష్కరణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


10. స్టోన్ టూల్స్

రాతి పనిముట్లు మానవజాతి సృష్టించిన తొలి సాంకేతికత. వీటిని 2 మిలియన్ సంవత్సరాల క్రితం హోమో హబిలిస్ కనుగొన్నారు. ఛాపర్స్‌గా అని పిలుచుకునే ఈ సాధనాలను ఒక రాయిని మరొకరాయితో పగలగొట్టడం ద్వారా తయారు చేశారు. ఈ సాధనాలను.. కత్తిరించడం, నొక్కడం లేదా తెగ్గొట్టడం కోసం ఉపయోగించేవారు. 

9. డాగ్యురోటైప్

మొదటి ఛాయాచిత్రం ఇది. డాగ్యురోటైప్, 1830లలో లూయిస్-జాక్వెస్-మాండే డాగురే, నైస్‌ఫోర్ నీప్సేలు కనుగొన్నారు. నీప్సే మొదటి ప్రయత్నానికి 8 గంటల ఎక్స్పోజర్ సమయం అవసరం కాగా, డాగురేకి 20 లేదా 30 నిమిషాలు అవసరమైంది. దీని ద్వారా మనకు కావలసిన చిత్రాలను తీయవచ్చు.

8. దిక్సూచి ఆవిష్కరణ

పురాతన నావికులు నక్షత్రాల ద్వారా నావిగేట్ చేసేవారు, కానీ ఈ పద్ధతి పగటిపూట లేదా మేఘావృతమైన రాత్రులలో పనిచేయదు. అందువల్ల భూమి నుండి చాలా దూరం ప్రయాణించడం సురక్షితం కాదు. చైనీయులు 9వ, 11వ శతాబ్దాల మధ్య మొదటి దిక్సూచిని కనుగొన్నారు. ఇది సహజంగా అయస్కాంతీకరించిన ఇనుప ఖనిజం లోడెస్టోన్ నుండి తయారు చేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం సముద్ర సంబంధాల ద్వారా యూరోపియన్లు, అరబ్బులకు చేరింది. ఈ దిక్సూచి నావికులు భూమి నుండి సురక్షితంగా నావిగేట్ చేయడానికి వీలు కల్పించింది, సముద్ర వాణిజ్యాన్ని మరింతగా పెంచింది. ఈ ఆవిష్కరణ కొత్త యుగానికి దారి  చూపింది.

7. బెస్సెమర్ ప్రక్రియ

బెస్సెమర్ ప్రక్రియతో ఉక్కును భారీగా ఉత్పత్తి చేయడం సాధ్యపడింది. ఇది నిర్మాణ రంగంలో భారీ ఆవిష్కరణలకు దారితీసింది. ఈ ప్రక్రియను 1840లలో సర్ హెన్రీ బెస్సెమర్ (ఇంగ్లండ్), విలియం కెల్లీ (అమెరికా) స్వతంత్రంగా, ఏకకాలంలో కనుగొన్నారు.

6. శాక్సోఫోన్

కొన్ని సంగీత వాయిద్యాలు శతాబ్దాలుగా ఉన్నప్పటికీ, సాక్సోఫోన్.. దాని అనంతర ఆవిష్కరణ. ఆంటోయిన్-జోసెఫ్ 1846 లో పారిస్‌లో మొదటి సాక్సోఫోన్ పేటెంట్ పొందారు. 

5. సెల్యులాయిడ్

సెల్యులాయిడ్ మొదటి సింథటిక్ ప్లాస్టిక్. ఇది మనిషి జీవితంలో భాగంగా మారిపోయింది. దీనిని 1860- 1870 లలో పారిశ్రామికవేత్త, ఆవిష్కర్త జాన్ వెస్లీ హయత్ అభివృద్ధి చేశారు. 


4. బల్బ్ ఆవిష్కరణ

సహజ కాంతి పగటి సమయాలకు పరిమితం అవుతుంది. బల్బ్ ఆవిష్కరణ మనం రాత్రిపూట పనిచేసేందుకు అవకాశం కల్పించడం ద్వారా ప్రపంచ గతిని మార్చివేసింది. 1800లలో బల్బ్‌ను కనిపెట్టడంలో చాలామంది కీలక పాత్ర పోషించారు. థామస్ ఎడిసన్ 1879లో ఒక జనరేటర్, వైరింగ్‌తో పాటు కార్బన్-ఫిలమెంట్ బల్బ్‌తో సహా పూర్తిగా ఫంక్షనల్ లైటింగ్ సిస్టమ్‌ను రూపొందించారు. దీంతో బల్బ్ ఆవిష్కర్తగా ఘనత సాధించారు. 

3. రైట్ ఫ్లైయర్ ఆఫ్ 1903

రైట్ సోదరులు రూపొందించిన చారిత్రక విమానాన్ని ప్రస్తావించకుంటే ఈ ఆవిష్కరణల జాబితా అసంపూర్ణం అవుతుంది. 1903లో రైట్స్ ఒక పైలట్ నియంత్రణలో విమానం టేకాఫ్ చేయగలనని నిరూపించాడు. ఈ ఆవిష్కరణ ప్రపంచ గతిని మార్చివేసిందనడంలో సందేహం లేదు.

2. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్

1958లో జాక్ కిల్బీ కనిపెట్టిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లు లేకుండా ఆధునిక ఎలక్ట్రానిక్స్ సాధ్యం కాదని చెప్పవచ్చు. మైక్రోచిప్ అని కూడా పిలిచే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్.. స్మార్ట్‌ఫోన్‌ మొదలుకొని కారులోని భాగాలకు ఉపయోగపడుతుంది. 

1. ఇంటర్నెట్

ఇంటర్నెట్‌కు నిజంగా పరిచయం అవసరం లేదు. లెక్కలేనంతమంది ఆవిష్కర్తలు దీనిని అభివృద్ధి చేయడంలో సహాయపడ్డారు. అయితే దీని ఆవిష్కరణ క్రెడిట్ కంప్యూటర్ శాస్త్రవేత్త లారెన్స్ రాబర్ట్స్‌కే దక్కింది.

Updated Date - 2022-03-06T17:38:04+05:30 IST