పాకెట్ కాలిక్యులేటర్ ఇన్వెంటర్ మృతి... సత్య నాదెళ్ల నివాళి

ABN , First Publish Date - 2021-09-18T02:00:02+05:30 IST

ప్రపంచలోని కోట్లాది మందికి దశాబ్దాల పాటూ నిత్యావసరంగా కొనసాగిన పాకెట్ కాలిక్యులేటర్ కనుగొన్నది సర్ క్లైవ్ సిన్‌క్లెయిర్. ఆయన 81 ఏళ్ల వయస్సులో క్యాన్సర్‌తో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. దశాబ్ద కాలంగా ప్రాణంతక వ్యాధితో సహజీవనం చేసిన ఆయన 1973లో పాకెట్ కాలిక్యులేటర్ మార్కెట్లోకి తీసుకొచ్చాడు.

పాకెట్ కాలిక్యులేటర్ ఇన్వెంటర్ మృతి... సత్య నాదెళ్ల నివాళి

ప్రపంచలోని కోట్లాది మందికి దశాబ్దాల పాటూ నిత్యావసరంగా కొనసాగిన పాకెట్ కాలిక్యులేటర్ కనుగొన్నది బ్రిటీష్ ఇన్వెంటర్ సర్ క్లైవ్ సిన్‌క్లెయిర్. ఆయన 81 ఏళ్ల వయస్సులో క్యాన్సర్‌తో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. దశాబ్ద కాలంగా ప్రాణంతక వ్యాధితో సహజీవనం చేసిన ఆయన 1973లో పాకెట్ కాలిక్యులేటర్ మార్కెట్లోకి తీసుకొచ్చాడు. ఆ తరువాత, 1980లో అతి చౌకైన కంప్యూటర్ కూడా సామాన్య ప్రజలకి ఆయన అందుబాటులోకి తెచ్చారు. వంద పౌండ్ల కంటే తక్కువ ధరకే సిన్‌క్లెయిర్ కంప్యూటర్... జనం ఇళ్లు, ఆఫీసుల్లోకి చేరిపోయింది. గత వారం కిందటి వరకూ కూడా ఆయన తన సరికొత్త ప్రయోగాలపై పని చేస్తున్నాడని సర్ క్లైవ్ సిన్‌క్లెయిర్ కూతురు వెల్లడించింది. 


జీవిత కాలం పాటూ సైన్స్‌ని, టెక్నాలజీని సామాన్యులకి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేసిన సిన్‌క్లెయిర్ తనకు గొప్ప ప్రేరణ అంటూ సత్య నాదేళ్ల ట్వీట్ చేశారు. ఆయన తయారు చేసిన మోడలే తన మొదటి కంప్యూటర్ అన్న నాదేళ్ల, ఇంజనీరింగ్‌పై తన ఆసక్తికి కారణం సర్ క్లైవ్ సిన్‌క్లెయిరేనంటూ నివాళులు అర్పించారు. 

Updated Date - 2021-09-18T02:00:02+05:30 IST