మానవహక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు

ABN , First Publish Date - 2021-01-17T08:08:04+05:30 IST

శ్రీలంకలో మూడు దశాబ్దాలుగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై నిర్దిష్ట కాలపరిమితో అంతర్జాతీయ స్వంతంత్ర

మానవహక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు

 యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి శ్రీలంక తమిళుల విజ్ఞప్తి 


కొలంబో, జనవరి 16: శ్రీలంకలో మూడు దశాబ్దాలుగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై నిర్దిష్ట కాలపరిమితో  అంతర్జాతీయ స్వంతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని, దానికి జవాబుదారీతనం ఉండేలా చూడాలని శ్రీలంక మైనార్టీ తమిళ రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘాన్ని కోరాయి.


ఈ మేరకు యూన్‌హెచ్‌ఆర్‌సీలోని 47 సభ్య దేశాలను ఉద్దేశిస్తూ లేఖ రాశాయి. సిరియాలో సాక్ష్యాల సేకరణకు ఒక సంవత్సరం కచ్చితమైన కాలవ్యధితో యంత్రాంగాన్ని ఏర్పాటుచేసినట్లుగానే  శ్రీలంక విషయంలోనూ వ్యవహరించాలని కోరాయి.  


Updated Date - 2021-01-17T08:08:04+05:30 IST