Rahul సమాధానాలతో ED సంతృప్తిగా లేదట!

ABN , First Publish Date - 2022-06-14T17:47:29+05:30 IST

నేషనల్ హెరాల్డ్‌లో కాంగ్రెస్ పార్టీ పాత్రకు సంబంధించి కూడా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలకు రాహుల్ సరిగ్గా సమాధానం చెప్పలేదని, దీనిపై ఈడీ అధికారులు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ప్రతి ప్రశ్నకు రాహుల్ చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పారని..

Rahul సమాధానాలతో ED సంతృప్తిగా లేదట!

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌(national herald) పత్రిక లావాదేవీల్లో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ(Rahul gandhi) సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) ముందు హాజరయ్యారు. ఉదయం 11.10 గంటల నుంచి రాత్రి 11.10 వరకు సుదీర్ఘ విచారణను ఎదుర్కొన్నారు. అయితే రాహుల్ చెప్పిన సమాధానాలతో ఈడీ అధికారులు సంతృప్తి చెందలేదని సమాచారం. విచారణలో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ గాంధీకి నేషనల్ హెరాల్డ్ సంస్ధలో షేర్లు ఎందుకున్నాయని ప్రశ్నించారట. అలాగే నేషనల్ హెరాల్డ్‌లో కాంగ్రెస్ పార్టీ పాత్రకు సంబంధించి కూడా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలకు రాహుల్ సరిగ్గా సమాధానం చెప్పలేదని, దీనిపై ఈడీ అధికారులు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ప్రతి ప్రశ్నకు రాహుల్ చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పారని, కొన్ని ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలో, వాటిని ఎలా తప్పించాలో తన లాయర్ ద్వారా రాహుల్ బాగా ప్రిపేర్ అయ్యారని ఈడీకి చెందిన ఒక అధికారి అన్నట్లు తెలుస్తోంది.


ఇక రాహుల్ గాంధీ తొలిరోజు విచారణపై మంగళవారం ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం జరిగిన విచారణ రాత్రి 8:30 గంటలకే ముగిసిందని, అయితే లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లడంతో సరిచేసి సంతకాలు తీసుకునేందుకు సమయం పట్టిందని పేర్కొంది. స్టేట్‌మెంట్లను రాహుల్ చూసి ఆమోదించిన తర్వాతే ఆయన ఈడీ కార్యాయలం బయటికి వచ్చారని ఈడీ పేర్కొంది. లిఖితపూర్వక సమాధానాల్లో తప్పులు దొర్లిన చోట మార్పులు చేయాలన్న లాయర్ సూచన మేరకు తాము వ్యవహరించామని, అందుకు రాహుల్ తమ కార్యాలయంలో రాత్రి 11:30 గంటల వరకు ఉండాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రాత పూర్వక సమాధానాల్లో తప్పులు దొర్లిన చోట మార్పులు చేస్తున్న సమయంలో ఈడీ అధికారులకు రాహుల్‌ పలుమార్లు క్షమాపణ చెప్పినట్లు సమాచారం.

Updated Date - 2022-06-14T17:47:29+05:30 IST