వైద్య సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-08-07T11:18:43+05:30 IST

జిల్లా కోవిడ్‌ ఆసుపత్రి అయిన నారాయణ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నియామకానికి వైద్యశాల నిర్వాహకులు గురువారం..

వైద్య సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(వైద్యం), ఆగస్టు 6 : జిల్లా కోవిడ్‌ ఆసుపత్రి అయిన నారాయణ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నియామకానికి వైద్యశాల నిర్వాహకులు గురువారం ప్రకటన విడుదల చేశారు. 1856 స్టాఫ్‌నర్సులు, 22 మంది ఎమర్జెన్సీ టెక్నీషియన్లు, 25 మంది అనస్థీషియా టెక్నీషియన్లు, 10 మంది రేడియాలజీ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి గల వారు ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. స్టాఫ్‌ నర్సులు, ఎమర్జెన్సీ టెక్నీషియన్‌, అనస్థీషియా టెక్నీషియన్లకు రూ.17,500, రేడియాలజీ అసిస్టెంట్‌కు  రూ.11వేల వేతనం చెల్లిస్తామన్నారు.

Updated Date - 2020-08-07T11:18:43+05:30 IST