అగ్నివీర్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-06-30T05:22:26+05:30 IST

భారత వాయుసేనలో అగ్నివీర్‌ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సైనిక సంక్షేమాధికారి మజ్జి కృష్ణారావు బుధవారం తెలిపారు.

అగ్నివీర్‌కు దరఖాస్తుల ఆహ్వానం

  ఉమ్మడిజిల్లా సైనిక సంక్షేమాధికారి కృష్ణారావు

సాలూరు రూరల్‌, జూన్‌ 29: భారత వాయుసేనలో అగ్నివీర్‌ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా సైనిక సంక్షేమాధికారి మజ్జి కృష్ణారావు బుధవారం తెలిపారు.  పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలో ఇంటర్‌, డిప్లమో పూర్తి చేసిన అభ్యర్థులు  వచ్చే నెల ఐదులోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.  సైన్స్‌ విభాగాల ఉద్యోగాలకు ఇంటర్‌ ఎంపీసీ, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఆటోమొబైల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫరేషన్‌ టెక్నాలజీలో మూడేళ్లు డిప్లమో కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఇతర ఉద్యోగాలకు ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు.   17 ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. శారీరక దారుఢ్యం, ఎత్తు 152.5 సెంటీమీటర్లు, ఎత్తుకు తగ్గ బరువు,  గాలి పీల్చినప్పుడు ఛాతి 5 సెంటీమీటర్లు ఉండాలని చెప్పారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు వచ్చే నెల 24 తరువాత ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారని పేర్కొన్నారు. అర్హత పరీక్ష, మెరిట్‌ లిస్ట్‌ తర్వాత విద్యార్హత పత్రాల పరిశీలన ఉంటుందన్నారు. అనంతరం శారీరక దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తారని చెప్పారు.  తొలి విడత జాబితా డిసెంబర్‌ 1న, తుది జాబితా అదే నెల 11న వస్తుందని స్పష్టం చేశారు. 

 


 1111111111111111111



పాఠశాల విలీనంపై నిరసన

విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా


గరుగుబిల్లి, జూన్‌ 29 : నాగూరులోని మండల పరిషత్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాలను జడ్పీ పాఠశాలలో విలీనం చేయొద్దని బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌ స్తంభించింది.  భారీగా వాహనాలు నిలిచిపోయాయి.  పాఠశాల విలీనం చేయడం వల్ల విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రధాన రహదారి గుండా  భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు.  పాఠశాల విలీనంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు పునరాలోచించాలని కోరారు. దీనిపై ఇప్పటికే  జిల్లా , మండల విద్యాశాఖాధికారులకు వినతిపత్రాన్ని ఇచ్చామని వారు చెప్పారు. నిబంధనల పేరుతో విలీనం చేస్తే నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. గ్రామ ప్రతినిధి కేతిరెడ్డి అచ్చుతరావు, విద్యా కమిటీ చైర్మన్‌ ఆర్‌.అప్పలనాయుడు, ఎం.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


 

29పిపి ఎంపి 5  ప్రధాన రహదారిపై నిరసన తెలుపుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

11111111111111111111

 వినూత్నంగా సాగుతూ!

 ప్రయోగాత్మకంగా రబ్బరు తోటల పెంపకం

   అందరి దృష్టిని ఆకర్షించిన గిరిజనుడు


(గుమ్మలక్ష్మీపురం)


ఆయనో సాధారణ గిరిజన రైతు. పోడు వ్యవసాయమే ఆధారం. అయితే గిట్టుబాటు కావడం లేదు. దీంతో వినూత్నంగా సాగాలని యోచించాడు.  సామాజిక మాధ్యమాల ద్వారా రబ్బరు సాగు గురించి తెలుసుకున్నాడు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందొచ్చని గ్రహించాడు. ప్రభుత్వం, అధికారుల ప్రోత్సాహం లేకపోయినా.. ధైర్యంగా ముందడుగు వేశాడు. కేరళ నుంచి మొక్కలు తెప్పించి సాగు చేపట్టి శభాష్‌ అనిపించుకుంటున్నాడు. మండలంలో గాజులగూడ గ్రామానికి చెందిన మండంగి అడ్డాయి అనే గిరిజన రైతు ప్రయోగాత్మకంగా రబ్బరు తోటల పెంపకాన్ని చేపట్టాడు. రెండేళ్ల కిందట కేరళ నుంచి  సుమారు 200 మొక్కలను తెప్పించి తన ఎకరా భూమిలో నాటాడు.  సామాజిక మాధ్యమాల ద్వారా సాగుపై అవగాహన పెంచుకుని, రబ్బరు తోట సంరక్షణ చర్యలు చేపట్టాడు.  ఒక్కో మొక్కను రూ.250 కొనుగోలు చేసిన ఆయన తోట పెంపకానికి ఇప్పటి వరకూ రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టాడు.  ప్రస్తుతం మొక్కలు ఆశించిన విధంగా పెరుగుతున్నాయి.  మరో మూడేళ్లు గడిస్తే వాటి నుంచి జిగురు తీసి రబ్బరు తయారు చేయొచ్చని రైతు అడ్డాయి చెబుతున్నాడు.  రబ్బరు తోటల పెంపకం వల్ల ఏడాదికి ఓ చెట్టుకు రూ.వెయ్యి వరకూ ఆదాయం వస్తుందని తెలిపాడు. ప్రస్తుతం వరిని కూడా పండిస్తున్న ఆయన ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాడు.  ఇదిలా ఉండగా రబ్బరు తోటల పెంపకం విజయవంతమైతే తాము కూడా ఇదే సాగు చేపడతామని  తోటి గిరిజన రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినా అడ్డాయి తన సొంత ఖర్చులతో రబ్బరు తోటల పెంపకం చేపట్టడం గొప్ప విషయమని వ్యవసాయాధికారులు తెలియజేస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం గిరిజన ప్రాంతం కూడా కేరళ మాదిరిగా రబ్బరు తోటల పెంపకానికి అనువుగా ఉంటుందని  ఏవో షణ్ముఖరావు  తెలిపారు. దీనికి విశాఖలో మార్కెట్‌ ఉందని చెప్పారు. 


మండంగి అడ్డాయి, గిరిజన రైతు  27పిపి ఎంపి 4, ఫోటో

 27పిపి ఎంపి 5 రబ్బరు తోటను సాగు చేస్తున్న గిరిజన రైతు అడ్డాయి

 111111

Updated Date - 2022-06-30T05:22:26+05:30 IST