తెలుగు రాష్ట్రాల్లో అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలు.. ఎన్నారైలకు ఆహ్వానం

ABN , First Publish Date - 2021-11-26T00:57:14+05:30 IST

అమెరికా తెలుగు సంఘం(ATA) ఆధ్వర్యంలో ఆటా(ATA) వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో డెసింబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 24 వరకూ జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆటా వారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ సదస్సులను నిర్వహించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలు.. ఎన్నారైలకు ఆహ్వానం

అమెరికా తెలుగు సంఘం(ATA) వేడుకలు డిసెంబర్ 5 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 24 వరకూ జరిగే ఈ వేడుకల్లో భాగంగా ‘ఆటా’.. వివిధ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ సదస్సులను నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణాలోని వివిధ ప్రాంతాలు ఈ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. డిసెంబర్ 26న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా జరిగే గ్రాండ్ ఫినాలేతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా.. ‘ఆటా’ నిర్వహకులు వివిధ దేశాల్లోని తెలుగు వారిని ఆహ్వానించారు. డిసెంబర్‌లో భారత్‌కు ప్రయాణం పెట్టుకున్న ఎన్నారైలు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. 







Updated Date - 2021-11-26T00:57:14+05:30 IST