20లోగా కోఆప్షన్‌ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-07-14T11:24:36+05:30 IST

నిర్మల్‌ మున్సిపల్‌ పాలకవర్గ కోఆప్షన్‌ సభ్యులుగా ఇద్దరిని నియమించేందుకు గాను ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 20లోగా

20లోగా కోఆప్షన్‌ సభ్యుల  నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

నిర్మల్‌ కల్చరల్‌, జూలై 13: నిర్మల్‌ మున్సిపల్‌ పాలకవర్గ కోఆప్షన్‌ సభ్యులుగా ఇద్దరిని నియమించేందుకు గాను ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 20లోగా మున్సిప ల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్‌ బాలకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన పురుషుడితో పాటు ఒక మహిళకు ఇందులో అవకాశం ఉందన్నారు. ఓటరు జాబితాలో పేరు నమోదై 21 ఏళ్ల వయస్సు గల అల్పసంఖ్యాక వ ర్గముల వారు అర్హులని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-14T11:24:36+05:30 IST