Volunteer పోస్టుల ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-02-02T20:52:47+05:30 IST

గ్రామ, వార్డు వలంటీర్‌ పోస్టుల ఖాళీల భర్తీకి నియామకం జరుగుతుందని జేసీ శ్రీధర్‌ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి శుక్రవారం వరకు...

Volunteer పోస్టుల ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 1: గ్రామ, వార్డు వలంటీర్‌ పోస్టుల ఖాళీల భర్తీకి నియామకం జరుగుతుందని జేసీ శ్రీధర్‌ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆయా మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు స్వీకరిస్తారని తెలిపారు. అదే రోజుల్లో దరఖాస్తుల స్ర్కూటినీ జరిపి 6న ఇంటర్వ్యూ, 7న పోస్టింగ్స్‌ ఇస్తారని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు అన్‌లైన్‌లో దరఖాస్తులు పంపుకోవాలని ఆయన కోరారు.


సచివాలయాల్లో  బయోమెట్రిక్‌ తప్పనిసరి: కలెక్టర్‌గ్రామ, వార్డు  సచివాలయాల ఉద్యోగులు ప్రతి రోజు విధిగా ఉదయం 10.30 గంటల్లోపు బయోమెట్రిక్‌ హాజరీ వేయాలని, వారానికి మూడు సార్లు వలంటీర్లు కూడా బయో మెట్రిక్‌ వేయాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష లో ఈ సూచన చేశారు.

Updated Date - 2022-02-02T20:52:47+05:30 IST