ప్రియుడిని చంపి.. నట్టింట్లోనే గొయ్యి తవ్వి ఉప్పు వేసి మరీ పూడ్చిపెట్టిన ప్రేయసి.. 7 నెలల తర్వాత షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2022-05-25T20:10:04+05:30 IST

వారిద్దరూ ప్రేమికులు.. ఒకే ఇంట్లో సహ జీవనం చేస్తున్నారు.. కొన్ని రోజుల తర్వాత ప్రేయసిపై ప్రియుడికి అనుమానం మొదలైంది..

ప్రియుడిని చంపి.. నట్టింట్లోనే గొయ్యి తవ్వి ఉప్పు వేసి మరీ పూడ్చిపెట్టిన ప్రేయసి.. 7 నెలల తర్వాత షాకింగ్ సీన్..

వారిద్దరూ ప్రేమికులు.. ఒకే ఇంట్లో సహ జీవనం చేస్తున్నారు.. కొన్ని రోజుల తర్వాత ప్రేయసిపై ప్రియుడికి అనుమానం మొదలైంది.. ఆమె మరొక యువకుడితో సన్నిహితంగా మెలగడాన్ని తట్టుకోలేకపోయాడు.. దీంతో ఆ యువకుడిని తన ఇంటికి పిలిపించి హత్య చేశాడు.. ప్రేయసి సహాయంతో మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి, ఉప్పు వేసి మరీ పూడ్చిపెట్టాడు.. ఏడు నెలల తర్వాత పక్కింటి వారిని బెదిరించే క్రమంలో తనంతట తనే పోలీసులకు దొరికిపోయాడు.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 

ఇది కూడా చదవండి..

ఇంటికి రా.. నీ కళ్ల ముందే నా భార్యను చంపేస్తా.. అని ప్రియుడు ఫోన్ చేస్తే వెళ్లిందా యువతి.. చివరకు ఊహించని ట్విస్ట్..


హబీబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన షంషేర్ అలియాస్ బబ్బూ, ఆశా ఠాకూర్ అనే మహిళ కొద్ది రోజులుగా ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత శివదత్‌ అనే యువకుడితో ఆశ సన్నిహితంగా ఉంటోందని బబ్బూకు అనుమానం మొదలైంది. శివదత్‌తో ముడిపెడుతూ ఆశను రోజూ వేధించేవాడు. ఆశ ఎంత చెప్పినా వినేవాడు కాదు. చివరకు శివదత్‌ను చంపాలని నిర్ణయించుకుని ఆశను సహాయం అడిగాడు. చేసేదేం లేక ఆశ సరేనంది. ఏడు నెలల క్రితం తన ఇంట్లో పార్టీ అని చెప్పి శివదత్‌ను బబ్బూ ఆహ్వానించాడు. ఇద్దరూ ముందుగా మద్యం సేవించారు. శివ మైకంలోకి వెళ్లాక బబ్బూ కత్తితో అతడి ఛాతిపై పొడిచి చంపేశాడు. 


అనంతరం బబ్బూ, ఆశ కలిసి ఇంటి ఆవరణలో అడుగు లోతు గొయ్యి తవ్వారు. దానిలో ఉప్పు వేసి శివ మృతదేహాన్ని లోపల వేసి పూడ్చేశారు. తాజాగా పక్కింటి వారితో బబ్బూకు గొడవ జరిగింది. దీంతో సోమవారం బాగా మద్యం సేవించిన బబ్బూ ఇంటి ఆవరణలో పూడ్చిన శివ పుర్రెను తీసుకుని బయటకు వెళ్లాడు. తనతో పెట్టుకుంటే శివలాగే నిన్ను చంపేస్తానని పక్కింటి మహిళను బెదిరించాడు. దీంతో ఆ మహిళ హబీబ్‌గంజ్ పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. బట్టల ఆధారంగా ఆ మృతదేహం శివదేనని అతని తండ్రి గుర్తించారు. మృతదేహానికి డీఎన్‌ఏ టెస్ట్ కూడా నిర్వహించనున్నారు. బబ్బూ, ఆశను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-05-25T20:10:04+05:30 IST