iPhone 11: రూ.28 వేల లోపే ఐఫోన్ 11 వస్తే.. సౌండింగ్ బాగుంది కదా.. నిజంగానే రూ.28 వేల లోపే.. ఎక్కడంటే..

Published: Wed, 17 Aug 2022 18:25:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon
iPhone 11: రూ.28 వేల లోపే ఐఫోన్ 11 వస్తే.. సౌండింగ్ బాగుంది కదా.. నిజంగానే రూ.28 వేల లోపే.. ఎక్కడంటే..

మొబైల్స్‌లో (Mobiles) ఐఫోన్‌కు (iPhone) ఉండే క్రేజే వేరు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ (premium smartphone) కావడంతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు (Budget Smartphones) కొనుగోలు చేసేవాళ్లు దాదాపుగా ఐఫోన్ కొనాలన్న ఆలోచన చేయరు. కానీ.. ఈ-కామర్స్ కంపెనీలు అందుబాటులోకి వచ్చాక ఐఫోన్లు కూడా ఆఫర్ ధరలలో లభిస్తున్నాయి. దీంతో.. ఐఫోన్ కొనే వారి సంఖ్య గతంతో పోల్చుకుంటే పెరిగిందనే చెప్పాలి. తాజాగా.. ఐఫోన్‌పై మరో ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వేదికగా అందుబాటులో ఉంది. ఐఫోన్ 11 (iPhone 11) మోడల్‌ ఫోన్ భారీ తగ్గింపు ధరకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. Apple iPhone 11 అసలు ధర 49,900 రూపాయలు ఉండగా.. 5 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో 46,999 రూపాయలకే లభిస్తుంది.


ఈ 46,999 రూపాయల ధరపై కూడా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో (Flipkart Axis Bank Credit Card) కొనుగోలు చేస్తే మరో రూ.2,350 తగ్గనుంది. ఇలా 44,649 రూపాయలకు ఐఫోన్ 11 వినియోగదారుడికి అందుబాటులో ఉంది. అంతేకాదు.. వీటన్నింటితో పాటు ఎక్స్‌ఛేంజ్‌లో (Exchange) ఐఫోన్ 11ను కొనుగోలు చేస్తే మరో 17,000 రూపాయలు తగ్గనుంది. ఇలా మొత్తంగా చూసుకుంటే.. మన దగ్గర వర్కింగ్ కండిషన్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఉండి.. 17,000 రూపాయల ఎక్స్‌ఛేంజ్ లభిస్తే.. ఐఫోన్ 11 ఫోన్ 27,649 రూపాయలకే వినియోగదారుడికి లభించనుంది.


ఫ్లిప్‌కార్ట్‌లో పైన చెప్పిన అన్ని ఆఫర్లు అప్లై అయి కొనుగోలు చేసిన వినియోగదారుడికి మాత్రమే ఈ ధరకు ఐఫోన్ 11 చేతికొస్తుంది. APPLE iPhone 11 64 జీబీ వేరియంట్ ఫోన్లపై మాత్రమే ఈ ఆఫర్ ఉంది. ఐఫోన్ 11 64 జీబీ వేరియంట్ ఫోన్ A13 Bionic Chip ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాక్ కెమెరా 12MP+12MP కాగా.. ఫ్రంట్ కెమెరా 12MP. డిస్‌ప్లే 6.1 అంగుళాలు కావడంతో నిక్షేపంగా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియోలను వీక్షించవచ్చు. ఈ ఫోన్‌కు బ్యాక్ కెమెరా హైలైట్ అని చెప్పాలి. 5D కెమెరాతో పోల్చలేం గానీ దాదాపు అంత క్వాలిటీలో ఫొటోలను ఈ ఫోన్‌లో తీయవచ్చు. మొత్తంగా చెప్పాలంటే.. బడ్జెట్ ఫోన్లపై బోర్ కొట్టి ఎక్స్‌ఛేంజ్‌లో ఐఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11 సేల్‌పై ఒక లుక్కేయొచ్చు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఓపెన్ హార్ట్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.