iPhone 14: భారత్‌లో ఐఫోన్ 14, 14 ప్రొ మోడళ్లు చాలా కాస్ట్ గురూ!.. ఏయే దేశాల్లో ఎంతంటే?

ABN , First Publish Date - 2022-09-12T22:22:08+05:30 IST

టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది ఐఫోన్ 14లో నాలుగు మోడళ్లను విడుదల చేసింది. వీటిలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్

iPhone 14: భారత్‌లో ఐఫోన్ 14, 14 ప్రొ మోడళ్లు చాలా కాస్ట్ గురూ!.. ఏయే దేశాల్లో ఎంతంటే?

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది ఐఫోన్ 14లో నాలుగు మోడళ్లను విడుదల చేసింది. వీటిలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ ఉన్నాయి. 6.1, 6.7 అంగుళాల డిస్‌ప్లే సైజులో వీటిని తీసుకొచ్చింది. అలాగే, పెద్ద కెమెరా, శక్తిమంతమైన బ్యాటరీ, డైనమిక్ ఐలాండ్ నాచ్, సెల్ఫీ ఆటోఫోకస్ వంటి ఫీచర్లను జోడిచింది. 


ఐఫోన్ 14 ముందస్తు ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్లస్ మోడల్ మినహా మిగతా ఫోన్ల అమ్మకాలు ఈ నెల 16 నుంచి మొదలవుతాయి. ఐఫోన 14 ప్లస్ మోడల్ అమ్మకాల కోసం అక్టోబరు వరకు ఆగక తప్పదు. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900 కాగా, ప్లస్ ధర రూ. 89,900. ఐఫోన్ 14 ప్రొ ప్రారంభ ధర రూ. 1,29,900 కాగా, ప్రొ మ్యాక్స్ ధర రూ. 1,39,900. జీఎస్టీ 18 శాతం, 22 శాతం దిగుమతి సుంకం కలుపుకునే ఈ ధరలు. కాబట్టి ప్రత్యేకంగా వీటిని చెల్లించాల్సిన పనిలేదు. అమెరికాలో గతేడాది ఐఫోన్ 13ను విక్రయించిన ధరకే ఇప్పుడు ఐఫోన్ 14ను విక్రయిస్తున్నారు. అయితే, ఐఫోన్‌కు కీలక మార్కెట్లు అయిన ఇండియా సహా ఇతర దేశాల్లో మాత్రం ఐఫోన్ ధరలను యాపిల్ భారీగా పెంచేసింది. 


అమెరికాలో..

అమెరికాలో ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాలర్లు (రూ.63,572.04). 14 ప్లస్ ధర 899 డాలర్లు (రూ. 71,528.49). ఐఫోన్ 14 ప్రొ, ప్రొ మ్యాక్స్  ధరలు వరుసగా 999 డాలర్లు (రూ.79,484.94), 1,099 డాలర్లు (రూ.87,446.00). భారత్‌తో పోలిస్తే అమెరికాలో ధరలు చవగ్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫోన్ కొనుక్కోవాలని చూస్తే మాత్రం దెబ్బతినడం ఖాయం. ఎందుకంటే ఇక్కడి ఫోన్లలో సిమ్ కార్డు ఉండదు. ఈ-సిమ్ (eSIM)తో పనిచేస్తాయి. కాబట్టి భౌతిక సిమ్‌‌ను వదులుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ఆండ్రాయిడ్ ఫోన్‌లో వేసుకుందామంటే అప్పుడు బాధపడాల్సి ఉంటుంది.  


కెనడాలో..

కెనడాలో ఐఫోన్ 14 ధర 1099 కెనడియన్ డాలర్లు (రూ.67,268.08). ఐఫోన్ 14 ప్లస్ ధర 1249 కెనడియన్ డాలర్లు (రూ.76,449.34), ఐఫోన్ 14 ప్రొ ధర 1399 కెనడియన్ డాలర్లు (రూ.85,649.53) కాగా, ప్రొ మ్యాక్స్ ధర 1549 డాలర్లు (రూ.94,832.82. 


హాంకాంగ్‌లో..

ఐఫోన్ 14 ధర హాంగ్‌కాంగ్‌లో 8599 హాంకాంగ్ డాలర్లు (HK). భారత కరెన్సీలో రూ.87,166.00. 14 ప్లస్ ప్రారంభ ధర హెచ్‌కే 7699 (రూ.78,029.78). ఐఫోన్ 14 ప్రొ ప్రారంభ ధర హెచ్‌కే 8599 (రూ.87,152.42), ప్రొ మ్యాక్స్ ధర హెచ్‌కే 9399 (రూ.95,278.98) 


సింగపూర్‌లో..

ఈ దేశంలో ఐఫోన్ 14 ప్రారంభ ధర ఎస్‌జీడీ(సింగపూర్ డాలర్లు) 1299 (రూ.73,995), ఐఫోన్ 14 ప్లస్ ధర ఎస్‌జీడీ 1499(రూ.85,387,77). ఐఫోన్ 14 ప్రొ ప్రారంభ ధర రూ. ఎస్‌జీడీ 1,649 (రూ. 93,9625.41) కాగా, ప్రొ మ్యాక్స్ ధర ఎస్‌జీడీ 1,799 (రూ. 1,02,469.26తో ప్రారంభమవుతోంది.  


 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో..

యూఏఈలో ఐఫోన్ 14 ధర 3,399 దిర్హమ్‌లు. భారత కరెన్సీలో రూ. 73,622.54. ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర ఏఈడీ 3,799(రూ.73,622.54), ఐఫోన్ 14 ప్రొ ధర ఏఈడీ 4,299 (రూ.93,109.60)కాగా, ప్రొ మ్యాక్స్ ధర ఏఈీడీ 4,699 (రూ.1,01,779.92) మాత్రమే. 

Updated Date - 2022-09-12T22:22:08+05:30 IST