iPhone 14 models: ఐ ఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్...ఇండియాలో కొత్త మోడల్స్ విడుదల రేపే

ABN , First Publish Date - 2022-09-08T14:28:01+05:30 IST

భారతదేశంలోని ఐ ఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్....

iPhone 14 models: ఐ ఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్...ఇండియాలో కొత్త మోడల్స్ విడుదల రేపే

న్యూఢిల్లీ: భారతదేశంలోని ఐ ఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఐఫోన్‌ కొత్త మోడల్‌ కోసం ఎదురుచూస్తున్న యాపిల్‌ లవర్స్‌ కల శుక్రవారం (రేపు) తీరనుంది.యాపిల్(Apple) కంపెనీ ఐఫోన్ కొత్త మోడళ్లను(iPhone 14 models) విడుదల చేయనుంది.(launched in India) ఐఫోన్ 14, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడళ్లను యాపిల్ కంపెనీ శుక్రవారం భారతదేశంలో (India)విడుదల చేయనుంది.గతేడాది మాదిరిగానే చిన్నపాటి మార్పుతో నాలుగు మోడళ్లను కంపెనీ ఆవిష్కరించింది.భారతదేశంలో ఐ ఫోన్ 14 మోడల్ ధర రూ.79,900గా కంపెనీ నిర్ణయించింది. 


ఐఫోన్ 14 ప్లస్ మోడల్ రూ.89,900లుగా, ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,09,900, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర 1,39,900గా యాపిల్ నిర్ణయించింది.ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ ట్రేడింగ్ ఈఎంఐ (EMI) చెల్లింపుపై కూడా ఫోన్లను అందిస్తోంది. ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.ఐఫోన్ 14 (iPhone 14) విక్రయాలు సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ వివరించింది. 


Updated Date - 2022-09-08T14:28:01+05:30 IST