CSK vs PBKS: Toss గెలిచి బౌలింగ్ ఎంచుకున్న Chennai Super Kings.. కానీ CSK బ్యాడ్ లక్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-26T00:39:06+05:30 IST

ఐపీఎల్‌లో పంజాబ్‌ జట్టుతో జరగనున్న మ్యాచ్‌లో CSK జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. PBKS బ్యాటింగ్‌ను కట్టడి చేసి ఛేజింగ్‌లో టార్గెట్‌ను ఫినిష్ చేయాలన్నది CSK వ్యూహంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఐపీఎల్‌లో..

CSK vs PBKS: Toss గెలిచి బౌలింగ్ ఎంచుకున్న Chennai Super Kings.. కానీ CSK బ్యాడ్ లక్ ఏంటంటే..

ముంబై: ఐపీఎల్‌లో పంజాబ్‌ జట్టుతో జరగనున్న మ్యాచ్‌లో CSK జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. PBKS బ్యాటింగ్‌ను కట్టడి చేసి ఛేజింగ్‌లో టార్గెట్‌ను ఫినిష్ చేయాలన్నది CSK వ్యూహంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఐపీఎల్‌లో హాట్ ఫేవరెట్ టీమ్స్ అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను ఈ 2022 సీజన్‌లో మాత్రం దురదృష్టం వెంటాడుతోంది. ముంబై ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా చేతులెత్తేసి అపరాధిలా నిల్చుంటే.. చెన్నై కూడా ఇంచుమించుగా ఈ పరిస్థితినే ఎదుర్కొంటోంది. పాయింట్ల పట్టికలో చిట్టచివర నుంచి రెండో స్థానంలో.. పై నుంచి తొమ్మిదో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇవాళ పంజాబ్ జట్టుతో తలపడబోతోంది. పంజాబ్ కూడా ఈ సీజన్‌లో మెరుగైన స్థితిలో ఏం లేదు. CSK మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడి రెండు గెలవగా, పంజాబ్ 7 మ్యాచ్‌లు ఆడి 3 గెలిచి నాలుగింటిలో ఓడింది. నెట్ రన్ రేట్ ఈ రెండు జట్లనూ కలవరపెడుతోంది. ఇలాంటి స్థితిలో నేటి మ్యాచ్‌లో పంజాబ్‌తో తలపడనున్న చెన్నై జట్టుకు ఊహించని షాక్ తగిలింది. CSK All-rounder Moeen Ali జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ఇక జరగబోయే CSK మ్యాచ్‌ల్లో Moeen Ali కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిసింది. గాయం కారణంగా ఈ England All-rounder కొన్ని మ్యాచ్‌ల్లో ఆడకపోవచ్చనే విషయం CSK జట్టుతో పాటు CSK Fansను కూడా నిరాశకు గురిచేసింది. Trainingలో ప్రాక్టీస్ చేస్తుండగా Moeen Ali చీలమండకు(Ankle Injury) గాయమైంది. ఏప్రిల్ 23న గాయపడిన Moeen Ali Ankleకు సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్ కోసం CSK వేచి చూస్తున్నట్లు తెలిసింది. అందువల్ల.. దాదాపుగా పంజాబ్‌తో జరగనున్న ఈ మ్యాచ్‌లో Moeen Ali ఉండకపోవచ్చనిసమాచారం. Moeen Ali స్థానంలో New Zealand spinner Mitchell Santnerను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. PBKSతో జరగనున్న మ్యాచ్‌లో దాదాపుగా Santner ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. Moeen Ali లేకపోవడం చెన్నై జట్టుకు కొంత ప్రతికూల అంశమని చెప్పక తప్పదు.



ఈ ఐపీఎల్‌ సీజన్‌లో CSK జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఐపీఎల్ వేలంలో రూ.14 కోట్లు పలికిన CSK స్టార్ బౌలర్ Deepak Chahar కూడా గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ నుంచే నిష్క్రమించిన పరిస్థితి. CSK బౌలింగ్‌ విభాగంలో Deepak Chahar పాత్ర ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి Deepak Chaharను CSK కోల్పోయింది. ఇప్పుడు Moeen Ali కూడా అందుబాటులో లేకుండా పోతే CSKకు గడ్డు స్థితి ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక.. పంజాబ్ టీంలో కూడా అదృష్టం కలిసి రావడం లేదు. ఏడు మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌ల్లో పంజాబ్ టాస్ ఓడిపోయింది. జట్టులో మార్పులు కూడా జరిగాయి. PBKS టీంలో ఈ మ్యాచ్‌కు సంబంధించి Shahrukh, Ellis, Arora లేరు. రాజపక్సా, సందీప్, రిషి ధావన్ జట్టులోకి వచ్చారు. తుది జట్ల వివరాలిలా ఉన్నాయి.  



Punjab Kings (Playing XI): మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్ట్రో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రాజపక్స, రిషి ధావన్, రబడ, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్


Chennai Super Kings (Playing XI): రవీంద్ర జడేజా(కెప్టెన్), రుత్‌రాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), మిచ్చెల్ శాంట్నర్, ప్రిటోరియస్, బ్రావో, ముకేష్ చౌదరి, తీక్షణ

Updated Date - 2022-04-26T00:39:06+05:30 IST