చితక్కొట్టిన డుప్లెసిస్.. పంజాబ్ ఎదుట కొండంత లక్ష్యం

Published: Sun, 27 Mar 2022 21:28:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చితక్కొట్టిన డుప్లెసిస్.. పంజాబ్ ఎదుట కొండంత లక్ష్యం

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్  చాలెంజర్స్ బెంగళూరు చితక్కొట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించి ప్రత్యర్థికి సవాలు విసిరింది. టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆర్సీబీ చెలరేగిపోయింది.


ముఖ్యంగా కెప్టెన్ ఫా డుప్లెసిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 57 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 88  పరుగులు పిండుకున్నాడు. అతడి దెబ్బకు పంజాబ్ బౌలింగ్, ఫీల్డింగ్ చెల్లాచెదురైంది. డుప్లెసిస్, అనూజ్ రావత్ (21) కలిసి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అనంతరం రాహుల్ చాహర్ బౌలింగులో రావత్ అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీతో కలిసి డుప్లెసిస్ జాగ్రత్తగా ఆడాడు.


కోహ్లీ క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ కలిసి మరింతగా చెలరేగారు. కోహ్లీ 29 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 41 పరుగులు చేశాడు.  మరోవైపు, సెంచరీ దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించిన డుప్లెసిస్ అర్షదీప్ బౌలింగులో షారూఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా బ్యాట్‌తో శివాలెత్తాడు. 14 బంతుల్లోనే 3 ఫోర్లు, మూడు సిక్సర్లతో 32 పరుగులు చేసి స్కోరును 200 పరుగులు దాటించాడు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.