పంజాబ్‌కు ధావన్.. రాజస్థాన్‌కు అశ్విన్.. ధర ఎంతంటే..

ABN , First Publish Date - 2022-02-12T18:04:10+05:30 IST

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-15 సీజన్‌కు సంబంధించిన మెగా వేలం ప్రారంభమైంది.

పంజాబ్‌కు ధావన్.. రాజస్థాన్‌కు అశ్విన్.. ధర ఎంతంటే..

బెంగళూరు: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-15 సీజన్‌కు సంబంధించిన మెగా వేలం ప్రారంభమైంది. వేలంలోకి తొలి ఆటగాడిగా శిఖర్‌ ధావన్‌ వచ్చాడు. అతని కోసం పంజాబ్‌, ఢిల్లీ నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డాయి. కనీస ధర. రూ.2 కోట్లతో ఈసారి వేలంలో బరిలోకి దిగిన గబ్బర్‌ను రూ.8.25 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది. అటు రవిచంద్రన్ అశ్విన్ కనీర ధర రూ.2కోట్లతో బరిలోకి దిగగా.. అతడిని రాజస్థాన్ రూ.5కోట్లకు దక్కించుకుంది. బెంగళూరులో ఇవాళ, రేపు రెండు రోజులు ఈ వేలం ప్రక్రియ జరగనుంది. ఈసారి మొత్తం 590 మంది క్రికెటర్లు వేలం బరిలో ఉంటే.. ఇందులో 227 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.  లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్ టైటాన్స్ జట్లు కొత్తగా చేరడంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరింది. 

Updated Date - 2022-02-12T18:04:10+05:30 IST